త‌గ్గింది బ‌డ్జెట్టే… నాగ్ పారితోషికం కాదు!

క‌రోనా కాలం ఇది. ఆదాయాలు త‌గ్గిపోయాయి. అంతా పొదుపు మంత్రం పాటిస్తున్నారు. సినిమా వాళ్లూ అంతే. బ‌డ్జెట్లు త‌గ్గించుకుంటున్నారు. ఆ ఎఫెక్టు బుల్లి తెర‌పైనా ప‌డింది. `బిగ్ బాస్` రియాలిటీ షోకు సైతం బ‌డ్జెట్లు త‌గ్గించేశారు. త్వ‌ర‌లో `బిగ్ బాస్ 4` తెలుగు సీజ‌న్ ప్రారంభం కాబోతోంది. ఇందులో పాల్గొంటున్న సెల‌బ్రెటీల‌కు ఇది వ‌ర‌క‌టితో పోలిస్తే… ఇప్పుడు పారితోషికం బాగా త‌గ్గించేశార‌ని వినికిడి. ప్రైజ్ మ‌నీలోనూ ఈ మార్పు క‌నిపించే ఛాన్సు వుంది.

అయితే నాగార్జున మాత్రం త‌న పారితోషికాన్ని ఏమాత్రం త‌గ్గించ‌లేదు. గ‌త సీజ‌న్‌తో పోలిస్తే.. ఈసారి నాగ్ ఎక్కువ‌గానే డిమాండ్ చేసిన‌ట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ 3 సీజ‌న్‌కీ నాగార్జునే హోస్ట్‌. ఆసీజ‌న్ దాదాపు వంద రోజుల పాటు సాగింది. అయితే ఈసారి 50 రోజుల‌కే ఈ సీజ‌న్ ప‌రిమితం చేయ‌నున్నారు. నాగ్ పారితోషికం రోజు వారీ కిందే లెక్క‌. ఎపిసోడ్ కి ఇంత‌.. అని డిసైడ్ చేశారు. గ‌తంలో కూడా ఇంతే. అయితే సీజ‌న్ 3 స‌మ‌యంలో నాగార్జున‌కి ఇచ్చిన పారితోషికంతో పోలిస్తే ఈసారి 25 శాతం ఎక్కువ‌ని ఇన్‌సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. నాగ్ అడిగినంత ఇవ్వ‌డానికి బిగ్ బాస్ యాజ‌మాన్యం అంగీక‌రించ‌క త‌ప్ప‌లేదు. ఎందుకంటే… ఈసారి హోస్ట్ కోసం చాలా అన్వేష‌ణ సాగింది. కానీ స్టార్లెవ‌రూ ఆస‌క్తి చూపించ‌లేదు. దాంతో నాగార్జున‌నే మ‌ళ్లీ ఎంచుకోక త‌ప్ప‌లేదు. అందుకే నాగ్ ఎంత అడిగితే, అంత ఇచ్చేస్తున్నారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల‌లోనూ, నాగ్ త‌న పారితోషికాన్ని ఈ రూపంలో పెంచుకోగ‌లిగాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

ప్రభాకర్ రావు వచ్చాకే అసలు ట్యాపింగ్ సినిమా !

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన గట్టు మల్లును ఇన్స్‌పెక్టర్ ను పెట్టుకుని ఓ మాఫియా నడిపారని...

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

విజయవాడ వెస్ట్ రివ్యూ : సుజనా చౌదరి నమ్మకమేంటి ?

ఏపీలో పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లిన నియోజకవర్గం విజయవాడ వెస్ట్. అక్కడ్నుంచి అభ్యర్థిగా సుజనా చౌదరిని ఖరారు చేయడంతో కూటమిలోని పార్టీలు కూడా ఒప్పుకోక తప్పలేదు. నిజానికి అక్కడ జనసేన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close