నా ఇష్టం : హానెస్ట్… ఓడిపోయారు..నాగబాబునేం అనకండి..!

జనసేనాధిపతికి దళపతిలాంటి నాగబాబు… నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో.. మూడో స్థానంలో ఉండిపోయారు. అంతకు ముందు ఆయన యూ ట్యూబ్ నుంచి ప్రారంభించి.. నర్సాపురం వరకూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు… అదే పనిగా వైరల్ అయ్యాయి. ఎందుకంటే.. ఆయన వీడియోలు.. మాటలు అన్నీ తన జనసేనాధిపతి గుణాలను పొగడటానికో… జనసేన పార్టీని పైకి లేపడానికో ఉపయోగించలేదు. అచ్చంగా.. రాజకీయ ప్రత్యర్థుల్ని ముఖ్యంగా.. టీడీపీని… టార్గెట్ చేయడానికే ఉపయోగించారు. ఇప్పుడు… ఫలితాలు వచ్చిన తర్వాత మూడు రోజులు సైలెంట్‌గా ఉండి.. నాలుగో రోజు.. హానెస్ట్ ఓపీనియన్స్‌తో.. ట్విట్టర్‌లోకి దూసుకొచ్చారు.

హానెస్ట్ … తనను ఏం అనకూడదనే ఆ రివర్స్ పోస్టులు..!?

తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది కాబట్టి.. చంద్రబాబు నిరాయుధుడు అయ్యాడని.. అందుకని ఆయన్ని విమర్శించడం శాడిజమేనని… నాగబాబు ఓ ట్వీట్ పెట్టారు. అబ్బా.. చంద్రబాబు మీద నాగబాబుకు ఎంత అభిమానం అని అందరూ అనుకుంటారని.. ఆయన భావన. ఆయనకు… టీడీపీ మీద ఎంత అభిమానం ఉందో… ఎన్నికలకు ముందు.. వ్యక్తిగతంగా చంద్రబాబు, లోకేష్ లక్ష్యంగా ఆయన చేసిన విమర్శలు చూసిన వారెవరికైనా… తెలిసిపోతుంది. మరి ఇప్పుడెందుకు ఇలా అన్నారు..? చంద్రబాబును ఓడిపోయారని ఎందుకు విమర్శించవద్దంటున్నారు..?. సింపుల్ లాజిక్. చంద్రబాబే కాదు.. తాను కూడా ఓడిపోయారు. అదీ కూడా మూడో ప్లేస్‌తో సరిపెట్టుకున్నారు. అందుకే ఇన్ డైరక్ట్‌గా… తనను విమర్శించవద్దని.. అలా విమర్శిస్తే… శాడిజమేనని చెప్పుకుంటున్నారు. దానికి… చంద్రబాబును అడ్డు పెట్టుకుంటున్నారు. వాటే హానెస్ట్..!

హానెస్ట్ … అప్పట్లో బూతులు తిట్టి ఇప్పుడు ఏమీ అనకూడదంటే ఎలా..?

నర్సాపురంలో ఎన్నికల ప్రచారంలో.. నాగబాబు నోటి వెంట అసువుగా వచ్చేసిన పదాలు కొన్ని ఉన్నాయి. సన్నాసిగాళ్లు, సొల్లుగాళ్లు, ఎదవ . రాస్కెల్స్, వేస్ట్ ఫెలోస్…ఇవి చాలా కొద్దిగా. పోటీ దారులను అంత చులకనగా మాట్లాడటం… ఇంత వరకూ రాజకీయాల్లో… కనిపించలేదు. రాజకీయంగా.. ఎన్నైనా విమర్శించుకోవచ్చు. కానీ.. ఏదో వ్యక్తిగత శత్రుత్వం ఉండి.. ఏమీ చేయలేక.. తిట్ల పురాణం అందుకున్నట్లుగా నాగబాబు… ప్రచారం చేశారు. దానికి రఘురామకృష్ణంరాజు… రివర్స్ కూడా అయ్యారు. అది ఆయనకు మేలే చేసిందని.. ఎన్నికల ఫలితాలతో తేలిపోయింది.

హానెస్ట్ … తెలంగాణ ఓటర్ నాగబాబుకి.. జగన్‌ సీఎం కాదుగా..?

నాగబాబు ఇప్పుడే..బోధిచెట్టు కింద.. జ్ఞానోదయమైన ట్విట్టర్ బుద్ధుడిలా … ప్రకటనలు చేస్తున్నారు. గొప్ప రాజనీతిజ్ఞుడినన్నట్లుగా.. ఏపీలో ఓట్లు వేయని వాళ్లకు కూడా.. జగనే సీఎం అన్నట్లుగా చెబుతున్నారు. నిజానికి ఏపీ ఓటర్లకు మాత్రమే… జగన్ సీఎం. ఏపీలో పోటీ చేసిన వాళ్లకు కాదు. నాగబాబుకు.. ఏపీలో ఓటు హక్కు లేదు. ఆయనకు తెలంగాణలో.. హైదరాబాద్‌లో ఉంది. కనీసం.. నర్సాపురంలో పోటీ చేయాలనుకున్నప్పుడు కూడా.. ఆయన తన ఓటు హక్కును..నర్సాపురంకు మార్చుకునే ప్రయత్నం చేయలేదు. అంటే.. ఆయన తెలంగాణ ఓటర్. జగన్ ఆయనకు ముఖ్యమంత్రి కాదు. అలాంటప్పుడు.. జగన్ ఎవరికి ముఖ్యమంత్రో.. నిర్దేశించి.. నీతులు చెప్పే ప్రయత్నం ఎందుకు చేయాలి..?. ఇది హానెస్ట్‌లో హానెస్టా..?

హానెస్ట్ … జనసేన గురించి కాస్త కేర్ తీసుకుంటే బెటరేమో..?

తమ్ముడికి పార్టీ ఉందని.. అందులో… తనో గొప్ప దళపతినని ఫీలైపోయి… రాజకీయ ప్రత్యర్థుల్ని వ్యక్తిగత శత్రువులుగా చేసుకుని… తిట్లు లంకించున్నప్పుడు లేని.. నీతులు.. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయో..నాగబాబు కూడా హానెస్ట్‌గా.,.. ఆత్మ విమర్శ చేసుకోవాలి. చంద్రబాబును.. ఇప్పుడు కొత్తగా విమర్శించాల్సిన అవసరం లేదు. విమర్శించేవాళ్లు విమర్శిస్తూనే ఉంటారు. రాజకీయాల్లో అవన్నీ సహజం. పట్టించుకునే తీరిక ఆయనకు ఉండకపోవచ్చు కానీ… నాగబాబు మాత్రం.. హానెస్ట్‌గా…, జనసేన గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందనేది.. చాలా మంది అభిప్రాయం..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close