పవన్ కన్నా నాగబాబుకే ఎక్కువ ఆస్తులు..! మరి ఆ ప్రచారం అంతా ఉత్తదేనా..?

తమ్ముడు పవన్ కల్యాణ్ కంటే… అన్న నాగేంద్రబాబే ఆస్తి పరుడు. తమ్ముడు సూపర్ స్టార్‌గా సంపాదిస్తూ.. ఆదాయపు పన్ను రూ. పాతిక కోట్లు కడుతున్నా… సినిమాలు తీసి సర్వం పోగొట్టుకున్న నాగబాబు ఆస్తే ఎక్కువ. ఈ విషయం ఎన్నికల అఫిడవిట్‌లో తేలింది. కొణిదెల నాగేంద్రబాబు నరసాపురం పార్లమెంట్‌ స్థానానికి జనసేన అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. అఫిడివిట్‌లో తను, తన భార్య పేరిట ఉన్న ఆస్తులు రూ. 41 కోట్లుగా చూపించారు. చరాస్థులు రూ. 36,73,50,772 , స్థిరాస్థులు రూ. 4,22,74,477 చూపించారు. అదే విధంగా అప్పులు రూ. 2,70,49,798గా పేర్కొన్నారు. అప్పులు పోను.. దాదాపుగా రూ. 40 కోట్ల ఆస్తి ఉంటుంది. కానీ పవన్ కల్యాణ్ ఆస్తులు రూ. 20 కోట్లు మాత్రమే. పవన్‌కల్యాణ్‌ తనకు రూ. 52 కోట్ల ఆస్తులున్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. చరాస్తులు రూ.12,00,48,393 కోట్లు, స్థిరాస్తులు రూ. 40,81,16,987 కోట్లు ఉన్నట్లుగా చూపారు. ఈ ఆస్తులకు తోడుగా.. అప్పులు రూ.33,72,65,361 కోట్లు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అంటే అప్పులు తీసేస్తే.. ఆస్తులు రూ. 20 కోట్లు మాత్రమే. పవన్ కన్నా..నాగబాబే ఆస్తిపరుడు. ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఒకటే.. సర్వం కోల్పోయిన తనను పవనే ఆదుకున్నాడని.. నాగబాబు పలుమార్లు చెప్పారు. మరి ఇప్పుడెలా..?

“ఆరెంజ్ సినిమాతో మొత్తం కోల్పోయా..! ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..!. కానీ తమ్ముడు పవన్ కల్యాణ్ ఆదుకున్నారు. అప్పులు తీర్చారు..!”.. ఇది అంజనా ప్రొడక్షన్స్ అధినేత, మెగా బ్రదర్ నాగేంద్రబాబు… చాలా సార్లు చెప్పిన మాట. “ఆరెంజ్ ” అనే సినిమా విషయంలో మాత్రం అది నిజం. ఆ సినిమాలో రామ్ చరణ్ హీరోగా ఉన్నా.. మగధీర లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ప్రభావం ఉన్నా… ఈ సినిమా మాత్రం అట్టర్ ఫ్లాపయింది. సాధారణంగా.. సినిమాలు ఫ్లాపయితే.. నేరుగా నిర్మాతలపై ప్రభావం ఉండదు. వాటిని కొనుక్కున్న వాళ్లపై ఉంటుంది. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం నాగేంద్ర బాబు పూర్తిగా నష్టపోయారని.. సర్వం కోల్పోయారన్న ప్రచారం జరిగింది. దాన్ని ఆయన పలుమార్లు అంగీకరించారు కూడా. చివరికి జబర్ధస్త్‌ ప్రోగ్రాంతో నిలదొక్కుకున్నానని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ తన ఫామ్ హౌస్‌ అమ్మేసి..నాగేంద్రబాబు అప్పులు తీర్చాలని.. బయట జోరుగా ప్రచారం జరిగింది. పవన్ తో పాటు.. కుటుంబంలో అందరూ తలా ఓ చేయి వేసి ఆదుకున్నారని నాగబాబు చెప్పారు. ఇప్పుడు ఆయన ధనవంతుడిగా మారిపోయారు.

అడిగిన వారందరికీ సాయం చేసేవాడు .. చివరికి తాను పేడవాడవుతాడనే నానుడి ఉంది. పవన్ కల్యాణ్ పరిస్థితి చూస్తే ప్రస్తుతం అంతే ఉందన్న అభిప్రాయం ఆయన ఫ్యాన్స్‌లో ఏర్పడుతోంది. అన్నకి సాయం చేసి.. ఆయన కన్నా.. తక్కువ ఆస్తి పరుడిగా మారిపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close