ఇక నాగ‌బాబు ‘జ‌బ‌ర్‌ద‌స్త్‌’

కొన్ని కార‌ణాల వ‌ల్ల‌ జ‌బ‌ర్‌ద‌స్త్ నుంచి త‌ప్పుకున్నాడు నాగ‌బాబు. `అదిరింది` షోని జ‌బ‌ర్‌ద‌స్త్ కి ధీటుగా తీర్చిదిద్దాల‌ని విఫ‌ల య‌త్నాలు చేశాడు. కానీ కుద‌ర్లేదు. ఇప్పుడు సొంతంగా ఓ కామెడీ షోని నిర్వ‌హించాల‌ని డిసైడ్ అయ్యాడు. `మన ఛాన‌ల్ మ‌న ఇష్టం` అనే యూ ట్యూబ్ ఛాన‌ల్ లో కొత్త టాలెంట్ ని ప్రోత్స‌హిస్తూ, ఓ షో చేయ‌బోతున్నాడు. అందుకోసం ఎంట్రీల‌ను కూడా ఆహ్వానిస్తున్నాడు. త్వ‌ర‌లోనే… ఇందుకు సంబంధించిన ఓ ప్ర‌క‌ట‌న రాబోతోంది. దాంతో పాటు మ‌రో కామెడీ షో కూడా చేయాల‌ని నాగ‌బాబు భావిస్తున్నాడు. స్టాండ‌ప్ కామెడీకి సంబంధించిన షో ఇది. ఈ రెండు కామెడీ షోలూ.. ‘మ‌న ఛాన‌ల్ మ‌న ఇష్టం’ అనే ఛాన‌ల్‌లోనే ప్ర‌సారం అవుతాయి. ఇందులోనూ టీమ్ లీడ‌ర్లు ఉంటారు. జ‌బ‌ర్ ద‌స్త్‌, అదిరింది షోల‌తో పాపుల‌ర్ అయిన వాళ్లే టీమ్ లీడ‌ర్‌లుగా కొన‌సాగుతారు. వాళ్ల టీమ్ లో కొత్త వాళ్లు వ‌చ్చి చేర‌తారు. ఇదీ నాగ‌బాబు ప్లానింగ్‌. కొత్త వాళ్ల‌ని ప్రోత్స‌హించిన‌ట్టూ ఉంటుంది. దాంతో పాటు త‌న‌కంటూ ఓ షోని జ‌నం ముందుకు తీసుకెళ్లిన‌ట్టూ ఉంటుంది. మ‌రి `అదిరింది` షోలో నాగ‌బాబు ఎప్ప‌టిలా పాల్గొంటారా? లేదంటే దాన్ని ప‌క్క‌న పెడ‌తారా? అనేది మాత్రం తెలియాల్సివుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close