చైతూ నో చెప్పిన క‌థ‌తో…

డిక్టేట‌ర్ త‌ర‌వాత వేదాశ్వ బ్యాన‌ర్‌పై మ‌రో సినిమా చేయాల‌ని ద‌ర్శ‌కుడు శ్రీ‌వాస్ త‌న ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశాడు. నాగ‌చైత‌న్య కోసం ఓ క‌థ సిద్ధం చేసి.. వినిపించాడు కూడా. నాగార్జున ఈ క‌థ విని ప‌చ్చ‌జెండా ఊపారు. నాగ‌చైత‌న్య – శ్రీ‌వాస్ కాంబినేష‌న్‌లో ఈ మూవీ దాదాపుగా సెట్ అయిపోతుంద‌ని కూడా అనుకొన్నారు. అయితే.. ఆఖ‌రి క్ష‌ణాల్లో నాగ‌చైత‌న్య నో అన‌డంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పుడు అదే క‌థ‌తో గోపీచంద్ ద‌గ్గ‌ర వాలాడు శ్రీ‌వాస్‌. ఆల్రెడీ ల‌క్ష్యం, లౌక్యం వంటి హిట్లు ఇచ్చాడ‌న్న ధైర్యంతో గోపీచంద్ ఈ క‌థ‌కు ఓకే చెప్పాడు. అయితే.. నాగ‌చైతన్య కోసం రాసుకొన్న క‌థ గోపీచంద్ ఇమేజ్‌కీ బాడీలాంగ్వేజ్‌కీ ఎలా సెట్ట‌వుతుంద‌న్న అనుమానాలు నెల‌కొన్నాయి.

శ్రీ‌వాస్ త‌న‌ క‌థ‌ల్లో కామెడీ, యాక్ష‌న్ ఈ రెండింటినీ స‌రైన మోతాదుల్లో జోడిస్తాడు. అయితే కామెడీ టైమింగ్ విష‌యంలో చైతూ కాస్త వీక్‌. అందుకే ఈ సినిమాని నాగ‌చైత‌న్య ప‌క్క‌న పెట్టిన‌ట్టు తెలుస్తోంది. సౌఖ్యం ఫ్లాప్ తో ఆల్రెడీ డీలాలో ప‌డిపోయాడు గోపీచంద్‌. ఈసారి ఎలాంటి రిస్క్ తీసుకోకుండా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన్‌మెంట్‌ని న‌మ్ముకొని క‌నీసం యావ‌రేజ్ కొట్టినా చాలు అన్న‌ట్టుగా ఉంది గోపీచంద్ ప‌రిస్థితి. శ్రీ‌వాస్ క‌నుక క‌లిస్తే.. త‌న కాంబినేష‌న్‌కి ప్రాధాన్యం పెరుగుతుంద‌ని భావించిన గోపీచంద్ నాగ‌చైత‌న్య నో చెప్పిన క‌థ‌కు ఓకే చేశాడ‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close