సవ్యసాచి vs శైలజారెడ్డి… చైతూ రియాక్షన్ ఏంటి?

ఏ సినిమా ముందు ప్రేక్షకుల ముందుకొస్తుంది… సవ్యసాచినా? శైలజారెడ్డి అల్లుడా? ఇటు ఇండస్ట్రీలో, అటు ట్రేడ్ వార్తల్లో ఒక్కటే ఉత్కంఠ. మా సినిమా ముందంటే… మా సినిమా ముందంటూ… రెండు సినిమా వర్గాలు పోటాపోటీగా విడుదల తేదీల గురించి ఫీలర్లు వదులుతున్నాయి. రెండూ అక్కినేని నాగచైతన్య సినిమాలే. మరి, రెండిటి విడుదల గురించి చైతూ రియాక్షన్ ఏంటి? ఏ సినిమా ముందు వస్తుంది? అని అడిగితే ఏం చెప్పాడు? తెలుసుకోండి.

“రెండు సినిమాలు చివరికి వచ్చేశాయి. ‘సవ్యసాచి’ ముందు మొదలైంది. కాబట్టి ఆ సినిమాయే ముందు విడుదల కావాలి. అయితే… ఫస్ట్ కాపీ చూశాక కానీ ఓ నిర్ణయం తీసుకోను. ఇటీవల నాకు నేనుగా ఓ రూల్ పెట్టుకున్నా. ఏ సినిమా అయినా సరే ఫైనల్ ఎడిట్ వెర్షన్ చూసి సంతృప్తి చెందితేనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఈ వారంలో నాకు ‘సవ్యసాచి’ చూపిస్తారు. చూశాక ఓ డెసిషన్ తీసుకుంటా” – ఇదీ ‘సవ్యసాచి’, ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాల విడుదల మధ్య పోటీ గురించి చైతూని ప్రశ్నించగా చెప్పిన ఆన్సర్. ‘సవ్యసాచి’ సీజీ వర్క్స్ ఎక్కువ అవసరం పడిన సినిమాగా చెప్పిన అతను… ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా మీద సంతోషంగా వున్నాడు. చక్కటి వినోదాత్మక కుటుంబ కథాచిత్రమని పేర్కొన్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close