అఫీషియల్‌: చైతూతో స‌మంత‌

పెళ్ల‌య్యాక నాగ‌చైత‌న్య‌, స‌మంత తొలిసారి క‌ల‌సి న‌టించ‌బోతున్నారు. ఈ వార్త ఎప్పుడో తెలిసినా.. ఇప్పుడు అధికారికంగా ధృవీక‌రించింది చిత్ర‌బృందం. ‘నిన్నుకోరి’తో ఆక‌ట్టుకున్న శివ నిర్వాణ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. షైన్ స్క్రీన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మాత‌లు. ఈ చిత్రానికి ‘ప్రేయ‌సి’ అనే పేరు పెట్టినట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ఇంకా డిసైడ్ చేయ‌లేద‌ట‌. ప్రేయ‌సి అనే పేరు అస‌లు త‌మ లిస్టులోనే లేద‌ని సన్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్‌, షూటింగ్ వివ‌రాలు, మిగిలిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నుంది చిత్ర‌బృందం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.