చైతూ, సమంత‌ల సొంత కుంప‌టి

అక్కినేని ఇంట్లో ఇప్ప‌టికే రెండు నిర్మాణ సంస్థ‌లున్నాయి. అన్న‌పూర్ణ స్డూడియోస్‌, మ‌నం ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ‌లు రెండూ వాళ్ల‌వే. సోలోగా సినిమాలు తీయాల‌నుకుంటే అన్న‌పూర్ణ స్డూడియోస్‌లో తీస్తారు. అదే భాగ‌స్వామ్యం ఇవ్వాలంటే మ‌నం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఉంది. ఇప్పుడు మూడో సంస్థ కూడా రాబోతోంది. నాగ‌చైత‌న్య‌, స‌మంత‌లు క‌ల‌సి ఓ నిర్మాణ సంస్థ‌ని స్థాపించాలన్న ఆలోచ‌న‌లో ఉన్నారు. అందుకు త‌గిన ఏర్పాట్లూ జ‌రుగుతున్నాయి. చైతూకి ఎప్ప‌టి నుంచో ప్రొడ‌క్ష‌న్ చేయాల‌నివుంది. అన్న‌పూర్ణ స్టూడియోస్ సినిమాల నిర్మాణ వ్య‌వ‌హారాల్ని త‌ను కూడా చూసుకుంటుంటాడు. `మ‌న్మ‌థుడు 2`కి సంబంధించిన ప్రొడ‌క్ష‌న్ కూడా స‌మంత‌, చైతూ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు వీరిద్ద‌రూ క‌ల‌సి ప్రొడ‌క్ష‌న్ హౌస్ స్థాపించాల‌ని చూస్తున్నారు. త‌మ‌కు న‌చ్చిన క‌థ‌లు వ‌చ్చిన‌ప్పుడు, త‌మ బ్యాన‌ర్‌లోనే తీసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నారు. ఆ క‌థ‌ల్లో తాము న‌టించినా, న‌టించ‌క‌పోయినా కొత్త‌వాళ్ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌న్న‌ది చై, స‌మంత‌ల ఉద్దేశం. మ‌రి ఈ ప్రొడ‌క్ష‌న్ ఏ సినిమాతో మొద‌లెడ‌తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close