నాగచైతన్య, శ్రుతిహాసన్ ల తొలి కాంబినేషన్

నాగచైతన్య, శ్రుతిహాసన్, చందు మొండేటి ల కాంబినేషన్ లో ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్ ‘ ప్రొడక్షన్ నెంబర్ 1
అక్కినేని నాగచైతన్య, శ్రుతిహాసన్ ల తొలి కాంబినేషన్.. ‘కార్తికేయ’ వంటి ఘన విజయం సాధించిన చిత్ర దర్శకుడు ‘చందు మొండేటి..మళయాళ సీమలో పెద్ద విజయం సాధించిన చిత్రం ‘ప్రేమం’ ఇలాంటి గొప్ప కలయికలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ . ఈ చిత్రానికి సంభందించిన అధికారిక ప్రకటన విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ..’అక్కినేని నాగచైతన్య, శ్రుతిహాసన్, చందు మొండేటి ల కాంబినేషన్ లో మలయాళం’ లో ఘన విజయం సాధించిన ‘ప్రేమం’ చిత్రాన్ని తెలుగు లో పునర్నిర్మించటం ఆనందంగా ఉంది. ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్’ పతాకం పై నిర్మిస్తున్న తొలి చిత్రమిది. ఈ నెలలోనే చిత్రం పూజా కార్యక్రమాలు జరుగుతాయి. డిసెంబర్ నెలలో చిత్రం రెగ్యులర్ షూటింగ్ విశాఖలో ప్రారంభమవుతుంది. సమ్మర్ స్పెషల్ గా చిత్రం విడుదల అయ్యే దిశగా నిర్మాణ కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతోందని ఆయన తెలిపారు.

‘ప్రేమం’ ఓ స్వచ్చ మైన ప్రేమకధ. ‘ప్రేమ తో కూడిన సంగీత భరిత వినోద దృశ్య కావ్యం ఈ చిత్రం.అక్కినేని నాగచైతన్య సరసన శ్రుతిహాసన్ తో పాటు మరో ఇద్దరు కధానాయికలు కూడా నటిస్తున్నారు. వారిలో ఒకరు ‘అనుపమ పరమేశ్వరన్’ కాగా మరో కధానాయిక ఎంపిక కావలసి ఉంది. మాతృకను మించి తెలుగు లో ఈ చిత్రం మంచి విజయం సాధించేలా దర్శకుడు ‘చందు మొండేటి’ రూప కల్పన చేస్తున్నారు అని ఆయన తెలిపారు.

దర్శకుడు ‘చందు మొండేటి’ మాట్లాడుతూ..’అక్కినేని నాగచైతన్య హీరోగా, సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని రూపొందించటం ఎంతో ఆనందంగా ఉంది. ‘ప్రేమం’ చిత్రాన్ని తెలుగులో రూపొందించటం అన్నది భాద్యత తో కూడినది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మా టీం ఈ చిత్రం రూపకల్పన కు కృషి చేస్తోంది అని తెలిపారు దర్శకుడు.

ఈ చిత్రానికి సంగీతం; రాజేష్ మురుగేషన్, గోపిసుందర్; చాయా గ్రహణం: కార్తీక్ ఘట్టమనేని: ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు; ఆర్ట్: సాహి సురేష్; ఒరిజినల్ స్టోరి: ఆల్ఫోన్సె పుధరిన్;
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశి
స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం: చందు మొండేటి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close