పాప్ సింగ‌ర్ తో శౌర్య ప్రేమాయ‌ణం

నాగశౌర్య – అనీష్ కృష్ణ కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఐరా క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో క‌థానాయిక‌గా షెర్లీ సేఠియాని ఎంచుకున్నారు. బాలీవుడ్ లో షెర్లీ మ‌హా ఫేమ‌స్‌. పాప్ సింగ‌ర్ గా మంచి పేరు తెచ్చుకుంది. అంద‌గ‌త్తై కూడా. ఫోర్బ్స్ ప‌త్రిక ఎంపిక చేసిన‌ అత్యంత ప్ర‌తిభావంతులైన న‌వ‌త‌రం క‌ళాకారుల్లో షెర్లీ కీ స్థానం ద‌క్కింది. ఇప్పుడు ఈ సినిమాతో చిత్ర‌సీమ‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. నాగ‌శౌర్య సొంత సినిమా `ఛ‌లో`తో ఇలానే… ర‌ష్మిక‌ని టాలీవుడ్ లోకి తీసుకొచ్చారు. త‌ను సూప‌ర్ స్టార్‌గా ఎదిగింది. మ‌రి.. షెర్లీ జాత‌కం ఎలా ఉంటుందో చూడాలి. మ‌హ‌తి సాగ‌ర్ సంగీతం అందిస్తున్నాడు. ఇదో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌. స్క్రిప్టు పూర్తి స్థాయిలో సిద్ధ‌మైంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని ప‌ట్టాలెక్కిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close