శేఖ‌ర్ క‌మ్ముల శిష్యుడితో నాగ‌శౌర్య

‘ఛ‌లో’తో నాగ‌శౌర్య‌లో జోష్ పెరిగింది. చ‌క చ‌క సినిమాలు చేసేస్తున్నాడు. త‌ను క‌థానాయ‌కుడిగా న‌టించిన ‘@ న‌ర్త‌న‌శాల‌’ వ‌చ్చే వారం విడుద‌ల అవుతోంది. భ‌వ్య క్రియేష‌న్స్ రూపొందిస్తున్న ‘నారీ నారీ న‌డుమ మురారీ’ చేతిలో ఉంది. ఇప్పుడు ‘గ‌ణ‌’ అనే మ‌రో సినిమా చేస్తున్నాడు. శేఖ‌ర్ క‌మ్ముల శిష్యుడు తేజ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇది కూడా శౌర్య సొంత సంస్థ ఐరా ప్రొడ‌క్ష‌న్స్ లోనే తెర‌కెక్క‌బోతోంది. ఇందులో క‌థానాయ‌కుడి పేరు ‘గ‌ణ‌ప‌తి’. ముద్దుగా ‘గ‌ణ‌’ అని పిలుచుకుంటారు. అదే టైటిల్ గా ఫిక్స‌య్యింది. తేజ న్యూయార్క్ లో ద‌ర్శ‌క‌త్వ విభాగంలో శిక్ష‌ణ పొందాడు. నాలుగు హాలీవుడ్ చిత్రాల‌కూ స‌హాయ‌కుడిగా ప‌నిచేశాడు. ‘ఫిదా’లో కొంత భాగం అమెరికాలో తెర‌కెక్కింది. ఆ స‌మ‌యంలో.. అక్క‌డ శేఖ‌ర్ క‌మ్ముల‌తో క‌ల‌సి ప‌నిచేశాడు. ‘గ‌ణ‌’ కూడా కొత్త త‌ర‌హా క‌థేన‌ట‌. వినోదం, ప్రేమ‌, యాక్ష‌న్‌.. ఈ అంశాల‌న్నీ మిళ‌త‌మై సాగుతుంద‌ట‌. ప్ర‌స్తుతం స్క్రిప్టు వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాలు ప్ర‌క‌టిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close