ఎంపీ అయినా.. ‘జ‌బ‌ర్‌ద‌స్త్’ వ‌ద‌ల‌డ‌ట‌!

న‌ర‌సాపురం ఎంపీ స్థానానికి జ‌న‌సేన త‌ర‌పున నాగ‌బాబు పోటీకి దిగిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న అక్క‌డ టీడీపీకి గ‌ట్టి పోటీ ఇస్తున్నారు. స‌మీక‌ర‌ణాల‌న్నీ క‌ల‌సి వ‌స్తే నాగ‌బాబు గెలిచినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌ని అక్క‌డి విశ్లేష‌కులు చెబుతున్నారు. ఎంపీగా గెలిస్తే నాగ‌బాబు సినిమాలు మానేస్తారా? జ‌బ‌ర్‌ద‌స్త్ షోలో క‌నిపించ‌రా? అనే సందేహాలు క‌ల‌గ‌డం స‌హ‌జం. అయితే.. నాగ‌బాబు ఆలోచ‌న మ‌రోలా ఉంది. సినిమాలు చేయ‌క‌పోయినా, జ‌బ‌ర్‌ద‌స్త్ మాత్రం వ‌ద‌ల‌న‌ని ఆయ‌న గ‌ట్టిగా చెబుతున్నారు.

”జ‌బ‌ర్‌ద‌స్త్ లాంటి కార్య‌క్ర‌మానికి జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రించ‌డం కూడా ఓర‌కంగా స‌మాజసేవ‌లాంటిదే. కాక‌పోతే.. ఇక్క‌డ మాకంటూ కొంత పారితోషికం ఇస్తారు. జ‌న‌సేన ప్ర‌చారం కోసం వెళ్లిన‌ప్పుడు ‘ఎంపీగా గెలిచినా జ‌బ‌ర్‌ద‌స్త్‌లో క‌నిపించ‌డం మాన‌కండి’ అని చాలామంది న‌న్ను అడిగారు. నెల‌కు 5 రోజులు జ‌బ‌ర్‌ద‌స్త్‌కి కేటాయిస్తే స‌రిపోతుంది. అందుకే ఆ కార్య‌క్ర‌మం వ‌ద‌ల‌ను. కానీ సినిమాల్లో మాత్రం న‌టించ‌లేను” అని క్లారిటీ ఇచ్చాడు.

ఇటీవ‌ల నాగబాబుపై శివాజీరాజా ‘పిల్లికి కూడా బిచ్చం పెట్ట‌డు. న‌ర‌సాపురం ఎంపీగా నాగ‌బాబుని గెల‌వ‌కూడ‌దు’ అంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంపై నాగబాబు తొలిసారి స్పందించాడు. శివాజీ రాజా కామెంట్ల‌ని లైట్ తీసుకున్నాడు. ‘ఇవ‌న్నీ చిన్న చిన్న విష‌యాలు. ఇంత‌కంటే పెద్ద పెద్ద విష‌యాల‌పై పోరాటం చేస్తున్నాను..’ అంటూ స‌మాధానం చెప్పారు. ‘మా అధ్య‌క్షుడిగా కొత్త‌వారికి అవ‌కాశం ఇద్దామ‌న్న ఉద్దేశంతోనే న‌రేష్ వెంట ఉన్నాను. నిజానికి న‌రేష్ కంటే శివాజీరాజా నాకు బాగా కావ‌ల్సిన‌వాడు. కానీ… రెండేళ్ల కాలంలో శివాజీ రాజా ప‌నితీరు నాకంత‌గా సంతృప్తిగా అనిపించ‌లేదు’ అంటున్నాడు నాగ‌బాబు. ఎన్నిక‌ల ఫీవ‌ర్ ఎలాగూ అయిపోయింది కాబ‌ట్టి… నాగ‌బాబు – శివాజీ రాజా ఎపిసోడ్‌కీ మంగ‌ళం ప‌డిపోయిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close