నానా ఆగమౌతున్న నాగం జ‌నార్థ‌న్ రెడ్డి!

క‌డుపు చించుకుంటే కాళ్ల మీద ప‌డుతుంద‌నీ వెన‌క‌టి ఓ సామెత‌. తెలంగాణ భాజ‌పా నాయకుడు నాగం జాన‌ర్థ‌రెడ్డి ప‌రిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంద‌ని చెప్పాలి. ఎందుకంటే, పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం త‌రువాత ఆయ‌న ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అర్థం కాని ఒక గంద‌ర‌గోళానికి గురౌతున్న‌ట్టున్నార‌ని చెప్పాలి. అదేంటీ.. ఆయ‌న భాజ‌పా నాయ‌కుడు క‌దా, సొంత పార్టీ తీసుకున్న నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించాలి క‌దా, దీన్లో గంద‌ర‌గోళం ఏముంద‌ని అనిపించొచ్చు. కాస్త జాగ్ర‌త్త‌గా ఆలోచిస్తే… తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై ఈ మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు నాగం. తెరాస అంటే ఆయ‌న‌కు గిట్ట‌డం లేద‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు!

ఇక‌, కేసీఆర్ వ్య‌వ‌హారం తీసుకుంటే… ఈ మ‌ధ్య ఆయ‌న కేంద్రంలోని భాజ‌పాకు ద‌గ్గ‌ర‌య్యే ప‌నిలో ఉన్నారు! పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణయం త‌రువాత తొలుత ఆవేద‌న చెంది, ఆ త‌రువాత ప్ర‌ధాని మోడీ నిర్ణ‌యానికి మ‌ద్ద‌తు తెలిపారు. అంటే, భాజ‌పాకి తెరాస మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టుగానే అర్థం చేసుకోవాలి. ఈ రెండు పార్టీల మ‌ధ్య ప‌రిస్థితి ఇలా ఉంది. ఈ త‌రుణంలో తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఇప్పుడు తెలంగాణ భాజ‌పా నేతలు కేసీఆర్‌ను విమ‌ర్శించే పరిస్థితి ఉంటుందా..? నగదు రహితంపై వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంటుందా..? అందుకే, ఇప్పుడు నాగం ఇర‌కాటంలో ప‌డిపోయారు. అలాగ‌ని ఆయ‌న కామ్‌గా కూర్చోలేదు. ఏకంగా తెలుగుదేశం కార్యాల‌యానికి నాగం బ‌య‌లుదేరి వెళ్ల‌డం విశేషం!

అనూహ్యంగా తెలుగుదేశం కార్యాలయంలో నాగం జ‌నార్థ‌న్ రెడ్డి ప్ర‌త్య‌క్షం కావ‌డంతో టీడీపీ నేత‌లు కూడా మొద‌ట న‌మ్మ‌లేక‌పోయారు. రేవంత్‌, రావుల‌, సండ్ర వంటి టీడీపీ నాయ‌కులంద‌రూ ఆయ‌న్ని ప‌ల‌క‌రించారు. దీంతో నాగం తెలుగుదేశం ఆఫీస్‌కు రావ‌డం ఏంట‌న్న చ‌ర్చ మొద‌లైంది. అస‌లే జంపింగులు సీజ‌న్ ఇది. ఎవ‌రు ఎటు వెళ్లినా అనుమానించాల్సి వ‌స్తోంది. కానీ, దేశం ఆఫీస్‌కు నాగం రావ‌డం వెన‌క ఎలాంటి రాజ‌కీయ ప్రాధాన్య‌త‌లూ లేవంటూ టీ.దేశం నేత‌లు కొట్టి పారేశారు.

ఇంత‌కీ, ఆయ‌న తెలుగుదేశం నేత‌ల్ని ఎందుకు క‌లుసుకున్న‌ట్టు అంటే… పెద్ద నోట్ల ర‌ద్దు త‌రువాత ప్ర‌జ‌లు అవ‌స్థ‌లు ప‌డుతున్నారు క‌దా. ఇదే భావ‌న తెలంగాణ భాజ‌పా నేత‌ల్లోనూ ఉంది. అయితే, దాన్ని బ‌య‌ట‌కి చెప్పుకోలేక‌పోతున్నారు. ఇలాంటి కొన్ని టాపిక్‌ల మీద ప్ర‌భుత్వాన్ని ఏ విధంగా ఇరుకున పెట్టొచ్చు అనే స‌ల‌హాలు తెలుగుదేశం పార్టీ నేత‌ల‌కు ఇచ్చేందుకే నాగం వారిని క‌లుసుకున్న‌ట్టు భావిస్తున్నారు. ఈ భేటీకి ఎలాంటి రాజ‌కీయ ప్రాధాన్య‌త లేక‌పోయినా… ప్ర‌త్య‌ేక ఆస‌క్తిని మాత్రం రేకెత్తించారు నాగం. మ‌రి, ఈ దోస్తీ ఈ అంశానికే ప‌రిమిత‌మౌతుందా లేదా అనేది చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close