“నాగం”కి మళ్లీ మాతృ పార్టీ గుర్తొచ్చింది..!

తెలంగాణకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డి హఠాత్తుగా.. చంద్రబాబుతో భేటీ అయ్యారు. దాదాపుగా గంట సేపు.. చంద్రబాబుతో.. తెలంగాణ రాజకీయాలపై చర్చించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న నాగం… ఎన్నికల ఫలితాల తర్వాత.. ప్రత్యక్ష రాజకీయాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఎన్నికల ప్రచారంలో.. తనకు ఇవే చివరి ఎన్నికలు అని కూడా ప్రకటించుకున్నారు. ఓడిపోవడంతో.. ఆయన ఇక రాజకీయాల్లో ఉండరేమో అనుకున్నారు. అయితే.. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి కొంత మంది టీడీపీ నేతలతో కలిసి వచ్చిన ఆయన… మంతనాలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.

నాగం జనార్దన్ రెడ్డి ఇప్పుడు ఎవరికీ కాని నాయకుడయ్యారు కానీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన తెలుగుదేశం పార్టీలో… నెంబర్ టూ పొజిషన్‌లో ఉండేవారు. ఓబులాపురం మైనింగ్ విషయంలో.. గాలి జనార్ధన్ రెడ్డిపై పోరాటంలో.. ఆయన తెగువ చూపించారు. చంద్రబాబు కూడా ఆయనకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే.. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత.. టీడీపీ నుంచి వెళ్లిపోయిన నేతల్లో నాగం మొదటి వారు. ఉస్మానియా యూనివర్శిటీలో ఆయనపై విద్యార్థుల పేరుతో.. కొంత మంది దాడి చేశారు. ఆ ఘటన తర్వాత.. కొన్నాళ్లకు టీడీపీ నుంచి విడిపోయి.. మొదటగా ఓ వేదికను పెట్టారు. తర్వాత పార్టీ పెట్టారు. కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో బీజేపీలో చేరారు. అక్కడ కూడా ఎవరూ పట్టించుకోలేదు. దాంతో.. గత ఎన్నికలకు ముందు జైపాల్ రెడ్డి సాయంతో కాంగ్రెస్‌లో చేరి .. నాగర్ కర్నూలు నుంచి మళ్లీ పోటీ చేశారు. కానీ ఫలితం మాత్రం మారలేదు.

కేసీఆర్‌తో ఉన్న రాజకీయ వైరం… కారణంగా గతంలో ఆయన పార్టీలో చేరలేకపోయారు. ఇప్పుడు చేర్చుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్‌లో ఇమడలేకపోతున్నారు. మళ్లీ బీజేపీలోకి వెళ్తామన్నా.. పిలిచేవాళ్లు లేకపోవచ్చు. ఈ క్రమంలో.. తన మాతృపార్టీ అయితే.. తనకు సౌకర్యంగా ఉంటుందన్న భావనలో జనార్దన్ రెడ్డి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓ పార్టీ నేతగా.. గుర్తింపు అయినా ఉంటుందని.. వచ్చే ఎన్నికల నాటికి అప్పటి పరిస్థితిని బట్టి .. నిర్ణయం తీసుకునే చాన్స్ కూడా ఉంటుందని అంచనా వేసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఆయన ఉద్దేశం కరెక్టే అయితే నాగం.. టీడీపీలో చేరినా ఆశ్చర్యపోనక్కరలేదు. అదే జరిగితే.. తెలంగాణ తెలుగుదేశానికి మంచి పరిణామమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close