వ‌స్తున్నాం… కొడుతున్నాం: నాగార్జున‌

ఓ సినిమా విడుద‌ల‌కు ముందు నాగార్జున కాన్ఫిడెన్స్‌గా మాట్లాడాడంటే… అందులో ఏదో విష‌యం ఉన్న‌ట్టే లెక్క‌! సోగ్గాడే చిన్ని నాయ‌న సినిమాకి ముందు ‘ఈ సంక్రాంతికి వ‌స్తున్నాం హిట్టు కొట్టేస్తున్నాం’ అంటూ అభిమానుల్ని ఊరించాడు. అన్న‌ట్టుగానే సోగ్గాడే తో పెద్ద హిట్టు కొట్టాడు నాగ్‌. ఇప్పుడు ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో ఫంక్ష‌న్‌లోనూ అదే మాట రిపీట్ చేశాడు నాగ్‌. నాగ‌చైత‌న్య‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టించిన చిత్ర‌మిది. క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌కుడు. ఆడియో ఫంక్ష‌న్ ఆదివారం సాయింత్రం అన్న‌పూర్ణ స్టూడియోలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా నాగ్ మాట్లాడుతూ ”అప్పుడు సోగ్గాడే చిన్ని నాయ‌న విష‌యంలో ఓ మాట చెప్పాను. సంక్రాంతికి వ‌స్తున్నాం, హిట్ కొడుతున్నాం అని. ఆ మాట నిజ‌మైంది. ఇప్ప‌డు మ‌రోసారి చెబుతున్నా.. ఈనెల 26న వ‌స్తున్నాం, హిట్ కొడుతున్నాం..” అంటూ కాన్ఫిడెన్స్ గా మాట్లాడాడు నాగ్‌.

”ఈ యేడాది రెండు బ్లాక్ బ్ల‌స్ట‌ర్లు ఇస్తాన‌ని ముందే చెప్పా. ఒక బ్లాక్ బ్ల‌స్ట‌ర్ చైతూ ఈ సినిమాతో ఇవ్వ‌బోతున్నాడు. రెండో బ్లాక్ బ్ల‌స్ట‌ర్ ప‌నిలో అఖిల్ బిజీగా ఉన్నాడు” అంటూ ఈ సినిమాపై త‌న న‌మ్మ‌కాన్ని వ్య‌క్త‌ప‌రిచాడు. ఫ్యాన్స్ కోసం ప్ర‌త్యేకంగా ఓ ట్రైల‌ర్ క‌ట్ చేయించాడు నాగ్. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌లోని కేవ‌లం యాక్ష‌న్‌పార్ట్‌ని మాత్ర‌మే హైలెట్ చేసి క‌ట్ చేసిన ట్రైల‌ర్ ఇది. కొత్త‌గా ఏం లేక‌పోయినా.. ఈ సినిమాలో యాక్ష‌న్ కంటెంట్ ఎంత ఉంటుందో చూపించింది. నాగ్ మాట‌లు నిజ‌మై… ఈ యేడాది అఖిల్ తొలి బ్లాక్ బ్ల‌స్ట‌ర్ అందుకొంటే.. అక్కినేని ఫ్యాన్స్‌ని ఆనంద‌మేగా..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com