నాగార్జున రంగంలోకి దిగక తప్పలేదా?

‘ఆఫీసర్’ సినిమాను నైజాంలో వర్మ కంపెనీ ద్వారా విడుదలవుతోంది. అంటే.. సినిమాను స్వంతంగా విడుదల చేస్తున్నారు. నిర్మాత ఓన్ రిలీజ్ చేస్తున్నారన్నమాట. కృష్ణాజిల్లాలో కామాక్షి కంబైన్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. రెస్ట్ ఆఫ్ ఆంధ్రలో ప్రిన్స్ ఫిలిమ్స్ ద్వారా శ్రీ సుబ్రమణ్యేశ్వర సినీ క్రియేషన్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఇదంతా అఫీషియల్ ఇన్ఫర్మేషన్. అయితే… ఈ డిస్ట్రిబ్యూషన్ పంపకాల వెనుక నాగార్జున హస్తం వుందని ఇండస్ట్రీ గుసగుస. ‘ఆఫీసర్’ టీజర్లు, ట్రైలర్ సినిమాపై కించిత్ ఇంట్రెస్ట్ కలుగజేయలేదనేది జగమెరిగిన సత్యం. వర్మపై ప్రేక్షకులకు నమ్మకం పోయి చాలా రోజులు అయ్యిందంటే… నాగార్జునపై, సినిమాపై వున్న కాస్త నమ్మకాన్ని ప్రచార చిత్రాలు తగ్గించాయి. ఈ నేపథ్యంలో సినిమాను కొనడానికి ఎవరూ ముందుకు రాలేదని సమాచారం. వచ్చిన వాళ్లకు వర్మ చెప్పిన రేట్లు చూసి కళ్లు తిరిగాయట. దాంతో నాగార్జున రంగంలోకి దిగక తప్పలేదట. నైజాంలో రామ్ గోపాల్ వర్మ స్వంతంగా విడుదల చేసుకోవడానికి ముందుకు వస్తే.. ఆంధ్ర బాధ్యతలను నాగార్జున తన భుజాలపై వేసుకున్నారని టాక్.

సినిమాను కృష్ణాలో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న కామాక్షి కంబైన్స్ నాగార్జున సన్నిహిత మిత్రుడు డి. శివప్రసాద్ రెడ్డిది. నాగార్జున స్వంత నిర్మాణ సంస్థ అంటే అన్నపూర్ణ సంస్థ ఎంత గుర్తుకు వస్తుందో? కామాక్షి సంస్థ స్వంత హీరోలు అంటే అక్కినేని ఫ్యామిలీ హీరోలు గుర్తుకు వస్తారు. నాగార్జునతో ‘కేడి’, నాగచైతన్యతో ‘దడ’ సినిమాలు పరాజయం పాలవడంతో డి. శివప్రసాద్ రెడ్డి నిర్మాణానికి దూరంగా వున్నారు. అడ‌పా ద‌డ‌పా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఆయన చేతిలో ‘ఆఫీసర్’ డిస్ట్రిబ్యూషన్ పెట్టడం వెనుక నాగార్జున హస్తం వుందని సమాచారం. అలాగే. రెస్ట్ ఆఫ్ ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్‌కి కూడా ఆయన మాట మీద విడుదల చేస్తున్నార్ట‌. ఏది ఏమైనా పంపిణీ చిక్కులు తొలగాయి. దాంతో జూన్ 1న సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.