పూరికి నాగ్ ఇచ్చిన బంప‌ర్ ఆఫ‌ర్‌?

రాంగోపాల్ వ‌ర్మ – పూరి జ‌గ్న‌నాథ్… ఇద్ద‌రూ దేశ ముదుర్లే. `ప‌నైపోయింది` అనుకుంటున్న స‌మ‌యంలోనే ఓ బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేస్తుంటారు. వ‌ర్మ‌ని తెలుగులో ఎవ‌రూ ప‌ట్టించుకోరు అనుకునే స‌మ‌యంలో నాగార్జున `ఆఫీసర్‌` ఆఫ‌ర్ ఇచ్చాడు. సేమ్ టూ సేమ్ శిష్యుడు పూరి కి కూడా నాగ్ ఇలాంటి ఆఫ‌రే అందించిన‌ట్టు స‌మాచారం. సూప‌ర్‌, శివ‌మ‌ణి… ఇవి రెండూ నాగ్ – పూరి కాంబోలో వ‌చ్చిన సినిమాలు. రెండూ ఆడింది అంతంత మాత్ర‌మే. అయితే ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడో ఆఫ‌ర్ ఇచ్చాడ‌ట‌. ఇటీవ‌ల పూరి నాగ్‌ని క‌ల‌సి ఓ క‌థ వినిపించాడ‌ని, అది నాగ్‌కి బాగా న‌చ్చింద‌ని, దాంతో ఈ కాంబో ఖాయ‌మైంద‌ని టాలీవుడ్ టాక్‌. ప్ర‌స్తుతం నానితో క‌ల‌సి ఓ మ‌ల్టీస్టార‌ర్‌లో న‌టిస్తున్నాడు నాగ్‌. ఆ వెంట‌నే బంగార్రాజు ఉంటుంది. బంగార్రాజు పూర్త‌య్యాక పూరితో కాంబో ఉండొచ్చు. ఈలోగా ఆకాష్ పూరితో ఓ సినిమా చేస్తాడు పూరి. ఆ సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉన్నా స‌రే, నాగ్‌తో సినిమా మాత్రం గ్యారెంటీ అన్న‌ది టాలీవుడ్ వ‌ర్గాల టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close