ఆల్ హ్యాపీస్ : చైతూ పెళ్లికి నాగ్ ఓకే

నాగ‌చైత‌న్య ల‌వ్ లో ఉన్నాడ‌ని, తెలుగు ప‌రిశ్ర‌మ‌కు చెందిన ఓ క‌థానాయిక‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో ప‌డిపోయాడ‌ని, వాళ్లిద్ద‌రూ పెళ్లి చేసుకోబోతున్నార‌న్న గాసిప్పులు గుప్పుమ‌న్నాయి. అయితే ఆ పెళ్లి చైతూ ఇంట్లో వాళ్ల‌కు ఇష్టం లేదని కూడా రూమ‌ర్లు వ‌చ్చాయి. అయితే.. ఇంట్లో త‌న పంతం నెగ్గించుకొన్నాడు చైతూ. త‌న పెళ్లికి ప‌చ్చ‌జెండా ఊపేశారు నాగార్జున‌, అమ‌ల‌. దాంతో నాగచైత‌న్య రూట్ క్లియ‌ర్ అయిపోయింది. ”చైతూ కోరుకొన్న అమ్మాయితోనే త‌న పెళ్లి జ‌రుగుతుంది. చైతూ డిసీజ‌న్ పై మా అంద‌రికీ న‌మ్మ‌కం ఉంది” అంటూ నాగార్జున త‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర వ్యాఖ్యానించార‌ని టాక్‌.

అతి త్వ‌రలో నాగ్ నుంచి చైతూ పెళ్లి విష‌య‌మై ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు రావొచ్చ‌ని తెలుస్తోంది. అంతేకాదు… అఖిల్ కూడా ప్రేమలో ప‌డ్డాడ‌న్న వార్త‌లు వ‌చ్చాయి. వాటినీ నాగ్ ధృవీక‌రించే అవ‌కాశం ఉంది. త‌న ఇద్ద‌రు వార‌సుల పెళ్లికి సంబంధించి నాగ్ అతి తొంద‌ర్లోనే ప్ర‌తిస్పందిస్తాడ‌ని అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close