నాగ్‌కి ఆహ్వానం అంద‌లేదా?

గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్ని వ‌న్నె తెచ్చారు. బాల‌య్య కోసం చిరంజీవి కూడా గొప్ప‌గా మాట్లాడ్డం ఇరు అభిమానుల‌కూ తెగ న‌చ్చింది. వెంక‌టేష్ కూడా వ‌చ్చి శుభాకాంక్ష‌లు అందించారు. అయితే.. ఈ వేడుక‌కు నాగార్జున ఎందుకు రాలేదు? అన్న అస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ మొద‌లైంది. హైద‌రాబాద్‌లో అదీ అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో జ‌రిగిన వేడుక ఇది. మ‌రి.. నాగ్ ఎందుకు రాలేదు?? బాల‌య్య ఆహ్వానం పంప‌లేదా, పంపినా నాగ్ రాలేదా? ఇలా కొన్ని ప్ర‌శ్న‌లు టాలీవుడ్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్‌.. వీళ్లంతా ఓ త‌రం క‌థానాయ‌కులు. తెలుగు చిత్ర‌సీమ‌కు ద‌శాబ్దాల పాటు మూల స్థంభాలుగా నిలిచిన‌వాళ్లు. అందుకే త‌న తోటి క‌థానాయ‌కులు చిరంజీవి, వెంక‌టేష్‌ల‌కు ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించాడు. వాళ్ల‌తో స్విచ్చాన్ కూడా చేయించాడు. మరి నాగ్‌ని ఎందుకు మ‌రిచిన‌ట్టు? ఇటీవ‌ల సుబ్బిరామిరెడ్డి అవార్డు వేడుక‌లో నాగార్జున‌కీ బాల‌య్య‌ ఓ విష‌యంలో మాటా మాటా అనుకొన్నార‌ని, అప్ప‌టి నుంచీ.. ఇద్ద‌రి మ‌ధ్యా మాట‌ల్లేవ‌ని తెలుస్తోంది. అందుకే… బాల‌య్య నాగ్‌కి ఆహ్వానం పంప‌లేద‌ట‌… అని టాలీవుడ్‌లో
చెవులు కొరుక్కొంటున్నారు. మ‌రి.. నిజ‌మేంటో ఈ హీరోల‌కే తెలియాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close