మీడియా పై నాగ్ కాస్త గుర్రు గానే వున్నాడని టాక్. నిన్న నిర్మలా కాన్మెంట్ ప్రెస్ మీట్ లో నాగ చైతన్య, అఖిల్ ల పెళ్లి మాట ప్రస్తావనకు రావడం, చైతన్య ప్రేమలో వున్నది సమంత తోనే అని నాగ్ కూడా బయటపడిపోవడం తెలిసిన విషయాలే. ఈ రోజు దాదాపు అన్ని దిన పత్రికలలో ఈ విషయం ప్రముఖంగా వచ్చింది. వెబ్ మీడియా కూడా ఈ విషయాన్ని హైలైట్ చేస్తోంది. ఈ వ్యవహారం పై నాగ్ కాస్త అసహనం ప్రదర్శించాడని తెలుస్తోంది. ఈ రోజు ఉదయం మళ్ళీ నాగ్ ఓ ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ సందర్భంగా నిన్నటి విషయాన్ని ప్రస్తావిస్తూ… “ఏదో క్యాజువల్ గా సమంత పేరు చెప్పా. దాన్ని హైలైట్ చేశారు. నిర్మలా కాన్వెంట్ గురించి మర్చి పోయారు. సమంత విషయం రాయకపోతే బాగుండేది కదా “ అని పత్రికల వాళ్ళతో అన్నట్టు టాక్.
నాగ్ చెప్పింది. మామూలు విషయం కాదు. సమంత విషయంలో తొలిసారి స్పందించాడు. అలాంటప్పుడు రాయకుండా ఎలా వుంటారు ? ఇది ఆఫ్ ది రికార్డ్ అని కూడా నాగ్ చెప్పలేదు. అందుకే… అది వార్త గా మారింది. ఇక నుంచి పత్రికల వాళ్ళ దగ్గర కాస్త జాగ్రత్త గా వుండాలని, లేదంటే… కష్టమే అని ఈ ఉదంతం తో నాగ్ కి తెలిసొచ్చింది
