చెక్కొద్దు… చుట్టేయ్‌.. ఏం ఫ‌ర్లేదు

నాగార్జున‌కు సోగ్గాడే చిన్నినాయ‌న లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు క‌ల్యాణ్ కృష్ణ‌. ఈ సినిమా రూ.50 కోట్ల మైలు రాయిని అందుకొంది. అక్కినేని ఆల్ టైమ్ క్లాసిక్ ‘మ‌నం’కి రాన‌న్ని వ‌సూళ్లు ‘సోగ్గాడే…’కి ద‌క్క‌డం విశేషం. అందుకే.. క‌ల్యాణ్ కృష్ణ‌పై మ‌రింత న‌మ్మ‌కాన్ని ఉంచాడు నాగ్‌. వ‌రుస‌గా మ‌రో రెండు సినిమాల‌కూ క‌మిట్ అయిపోయాడు. ‘బంగార్రాజు’ త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌బోతోంది. ఈలోగా నాగ‌చైత‌న్య‌తో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా ప‌నుల్లో ఉన్నాడు క‌ల్యాణ్ కృష్ణ‌. అయితే… ‘రారండోయ్‌’ని త్వ‌ర‌గా ముగించ‌మ‌ని నాగ్ తొంద‌ర పెడుతున్నాడ‌ని, క‌ల్యాణ్‌పై తీవ్ర‌మైన ఒత్తిడి తీసుకొస్తున్నాడ‌న్న‌ది ఇన్ సైడ్ టాక్‌.

ఎందుకంటే ఓం న‌మో వేంక‌టేశాయ నాగ్‌కి మ‌ర్చిపోలేని డిజాస్ట‌ర్‌ని అందించింది. అందులోంచి వీలైనంత త్వ‌ర‌గా తేరుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడు నాగ్‌. ఓ వైపు రాజుగారి గ‌ది 2 చేస్తున్నా.. ఏదో వెలితి వెంటాడుతోంది. అందుకే `బంగార్రాజు`ని త్వ‌ర‌గా ప‌ట్టాలెక్కించ‌మంటున్నాడ‌ట‌. దాంతో నాగ‌చైత‌న్య సినిమాని మ‌రింత స్పీడ‌ప్ చేయాల్సి వ‌స్తోంది. ‘ప‌ర్‌ఫెక్ష‌న్ పేరుతో చెక్కుకుంటూ కూర్చోకు.. అందుబాటులో ఉన్న వ‌న‌రుల‌తో స‌ర్దుకుపో..’ అంటూ నాగ్ చెప్పాడ‌ట‌. ఈ సినిమాని నాగార్జున నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్రొడ్యూస‌ర్ నుంచే.. ఇలాంటి హుకూం వ‌స్తే ఇక ద‌ర్శ‌కుడు ఏం చేస్తాడు? అందుకే చైతూ సినిమాని వీలైనంత త్వ‌ర‌గా ‘చుట్టేసే ప‌నిలో’ ఉన్నాడ‌ని టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజ‌య్ పాత లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు తీస్తారా?

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'డియ‌ర్ కామ్రేడ్‌', 'ఖుషి' చిత్రాల తాలుకూ క‌మ‌ర్షియ‌ల్ రిజ‌ల్ట్ ఏమిటి? ఈ సినిమాల వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోయారా, లాభ‌ప‌డ్డారా? ఈ లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు రాబోతున్నాయి. విజ‌య్...

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close