నాగ్ కూడా దిగిపోతున్నాడు

చిరంజీవి 150వ సినిమా మొద‌లైపోయింది. గురువారం నుంచి చిరు సెట్లో హంగామా చేస్తున్నాడు. ఇప్పుడు నాగార్జున వంతు వ‌చ్చింది. ఆరు నెల‌ల నుంచి షూటింగ్ హ‌డావుడికి దూరంగా ఉన్న నాగ్‌… సుదీర్ఘ విరామం త‌ర‌వాత మేక‌ప్ వేసుకోబోతున్నాడు. నాగ్ – కె.రాఘ‌వేంద్ర‌రావు క‌ల‌యిక‌లో ఓ చిత్రం మొద‌ల‌వ్వ‌బోతోంది. శ‌నివారం నుంచి చిత్రీక‌ర‌ణ ప్రారంభిస్తారు. గురువారం చిత్ర‌బృందం తిరుమ‌ల‌లో వేంక‌టేశ్వ‌రుని ద‌ర్శ‌నం చేసుకొంది. అక్క‌డే ఈ సినిమా విశేషాల్ని తొలిసారి అధికారికంగా ప్ర‌క‌టించారు. టైటిల్ కూడా క‌న్‌ఫామ్ చేసేశారు. ఓం న‌మో వేంక‌టేశాయ అనే పేరు ఈ సినిమాకి ఫిక్స్ చేశారు. నాగ్ హాథీరామ్ బాబాగా క‌నిపిస్తార‌ని రాఘ‌వేంద్ర‌రావు ప్ర‌క‌టించారు.

అనుష్క‌, ప్ర‌గ్యాజైస్వాల్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఓ పాత్ర‌లో విమ‌లారామ‌న్ క‌నిపిస్తోంద‌ని స‌మాచారం. కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే నాలుగు పాట‌ల్ని కూడా రికార్డ్ చేసేశార‌ని చిత్ర‌బృందం తెలిపింది. ఈ యేడాది చివ‌రిలోగా ఈ చిత్రాన్ని సిద్దం చేయ‌నున్నారు. నాగ్‌కి డిసెంబ‌ర్ నెల బాగా సెంటిమెంట్ . ఆ నెల‌లోనే శ్రీ న‌మో వేంక‌టేశాయ విడుద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close