మ‌మ్ముట్టి పాత్ర‌లో నాగ్?

‘ఏజెంట్’ షూటింగ్ నిన్న‌టి నుంచి ప్రారంభ‌మైంది. అక్కినేని అఖిల్ – సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్ర‌మిది. ఇందులో మ‌మ్ముట్టి ఓ కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. నిజానికి ఈ పాత్రని నాగార్జున చాలా ఇష్ట‌ప‌డ్డార‌ని తెలుస్తోంది. సురేంద‌ర్ రెడ్డి ఈ క‌థ‌ని నాగార్జునకు వినిపించిన‌ప్పుడు `ఈ పాత్ర నేను చేస్తే ఎలా ఉంటుంది` అని సురేంద‌ర్ రెడ్డిని అడిగార‌ని, కానీ సూరి మాత్రం సున్నితంగా తిర‌స్క‌రించాడని టాక్‌.

నాగ్ ఈ పాత్ర చేస్తే… `ఏజెంట్`పై అంచ‌నాలు భారీగా పెరిగిపోతాయి. ఇది అఖిల్ సినిమాగా కాకుండా, నాగ్ సినిమాగా బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఆ ప్ర‌భావం అఖిల్ కెరీర్‌పై ప‌డుతుంద‌ని, సినిమా హిట్ట‌యినా దాన్ని నాగ్ సినిమానే జ‌నం భావిస్తార‌ని… సూరి న‌చ్చ‌జెప్పాడ‌ట‌. అప్ప‌టికే సురేంద‌ర్ రెడ్డి మైండ్ లో మ‌మ్ముట్టి ఉండ‌డంతో.. నాగ్ కూడా `స‌రే` అన్నాడ‌ట‌. ఈ పాత్ర గురించి నాగ్ నే స్వ‌యంగా మ‌మ్ముట్టికి ఫోన్ చేసి చెప్పాడ‌ని, నాగ్ నుంచి ఫోన్ రావ‌డంతో మ‌మ్ముట్టి కూడా కాద‌న‌లేక‌పోయాడ‌న్న‌ది ఇన్‌సైడ్ వ‌ర్గాల టాక్‌. అదే గ‌నుక‌.. నాగ్ చెప్పిన వెంట‌నే సూరి ఓకే అంటే.. ఇది మ‌రో అక్కినేని మ‌ల్టీస్టార‌ర్ అయిపోదును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close