నాగార్జున… నాని… ఫిబ్రవరి 24

‘కింగ్’ నాగార్జున, ‘నేచురల్ స్టార్’ నాని హీరోలుగా నటించే చిత్రానికి ముహూర్తం కుదిరింది. ఫిబ్రవరి 24న ఈ చిత్రానికి పూజ చేయనున్నారు. ఎన్టీఆర్‌తో ‘ఎదురులేని మనిషి’, ‘యుగ పురుషుడు’, చిరంజీవితో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’, ‘ఇంద్ర’, నాగార్జునతో ‘ఆజాద్’, ‘రావోయి చందమామ’ వంటి భారీ చిత్రాలను నిర్మించిన వైజయంతీ మూవీస్ సంస్థ కొంత విరామం తర్వాత నిర్మిస్తున్న చిత్రమిది. ‘భలే మంచి రోజు’, ‘శమంతకమణి’ చిత్రాలు తీసిన శ్రీరామ్ ఆదిత్య దీనికి దర్శకుడు.

నాగార్జున, నానిల ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ లను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ రెడీ చేశారట. ఫిబ్రవరిలో చిత్రానికి పూజ చేసి, మార్చిలో షూటింగుకు వెళతారు. తర్వాత ముంబైలో కొన్ని రోజులు చేసి, హాట్ హాట్ సమ్మర్‌లో కూల్ ఫారిన్ లొకేషన్లకు వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారట! ఇందులో హీరోయిన్ల వివరాలను ఇంకా ప్రకటించలేదు. ఓపెనింగ్ రోజున అనౌన్స్ చేసే ఛాన్సుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]