ఏ పార్టీకా గొడుగు.. నాగ్ వైఖ‌రి ఇదేనా??

నాగార్జున వైసీపీలోకి చేర‌బోతున్నార‌న్న వార్త మంగ‌ళ‌వార‌మంతా చ‌క్క‌ర్లు కొట్టింది. ఆయ‌న గుంటూరు సీటు కోసం గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నార‌ని దానికి జ‌గ‌న్ కూడా సానుకూలంగా స్పందించార‌ని చెప్పుకున్నారు. అయితే ఈ వార్త‌ల‌పై నీళ్లు చ‌ల్లాడు నాగ్‌. రాజ‌కీయాల్లోకి రావాల‌న్న ఆస‌క్తి త‌న‌కెప్పుడూ లేద‌ని, జ‌గ‌న్‌ని మ‌ర్యాద‌పూర్వ‌కంగానే క‌లుసుకున్నాన‌ని తేల్చేశాడు.

నాగ్ ముందు నుంచీ ఇంతే. ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీ కి ద‌గ్గ‌ర‌వుతున్న‌ట్టు క‌నిపిస్తుంటాడు. అటు తెలుగు దేశంలోనూ, ఇటు వైకాపాతోనూ ట‌చ్‌లో ఉన్న‌ట్టు క‌నిపించ‌డానికి కార‌ణం అదే. ఏ పార్టీకి వ‌కాల్తా పుచ్చుకుని మాట్లాడ‌డు. వైఎస్ అధికారంలో ఉన్న‌ప్పుడు… వైఎస్ నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల్ని కొనియాడాడు. మ‌ళ్లీ నారా చంద్ర‌బాబు నాయుడు ప‌ద‌విలోకి రాగానే… చంద్ర‌బాబు నాయుడు దూకుడుని మెచ్చుకున్నాడు. తెలంగాణ విష‌యంలోనూ అదే జ‌రిగింది. ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిందో, అప్పుడు కేటీఆర్‌నీ, కేసీఆర్‌నీ ఆకాశాన్ని ఎత్తేయ‌డం ప్రారంభించాడు. ఎన్ క‌న్వెన్ష‌న్ కేసు కోర్టులో ఉన్న‌ప్పుడు.. ఆ స్నేహం చాలా మ‌ట్టుకు ఉప‌యోగ‌ప‌డింద‌ని, ఎన్ క‌న్వెన్ష‌న్‌లో కొంత భాగం ప్ర‌భుత్వ ప‌రం కాకుండా కాపాడింద‌ని ఇండ్ర‌స్ట్రీ వర్గాలు చెబుతుంటాయి.

త్వ‌ర‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌లు రాబోతున్నాయి. ఈసారి తేదాపా – వైకాపా నువ్వా నేనా అన్న‌ట్టున్నాయి. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావొచ్చు. అందుకే ఎందుకైనా మంచిద‌ని… జ‌గ‌న్‌ని ప్ర‌స‌న్నం చేసుకున్నాడేమో అనిపిస్తోంది. వైకాపాలో నాగ్‌కి నిజంగానే చేరాల‌ని వుంటే, ఈ పాటికే ఆ ప‌నుల‌న్నీ అయిపోయి ఉండేవి. నాగ్ ఉద్దేశం ఓ పార్టీలో చేరి, టికెట్ అందుకుని గెల‌వ‌డం కాదు. రాబోయే రోజుల్లో త‌న స్థ‌లాల‌కు, ఆస్తుల‌కు, మ‌రీ ముఖ్యంగా అన్న‌పూర్ణ స్డూడియోకి ఎలాంటి ఆటంకం రాకుండా ఉండ‌డం. అందుకే ఏ పార్టీకి వ్య‌తిరేకి కాద‌న్న ముద్ర కోసం ఇలా ప‌రిత‌పిస్తుంటాడు. ఇదంతా చూస్తే… నాగ్ త‌న స్వ‌ప్ర‌యోజ‌నాల కోస‌మే, పార్టీల‌కు అతీతంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌న్న విష‌యం మాత్రం స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close