నాగ్ … నష్ట నివారణ చ‌ర్య‌లు

”శ్రీ‌రామ్ ఆదిత్య రెండు రోజుల క్రిత‌మే ఈ సినిమా చూపించాడు. ఇంకాస్త ముందు చూపించి ఉంటే… మాకు చేత‌నైన మార్పులు చేర్పులూ చేసి ఈ సినిమాని ఇంకాస్త బెట‌ర్‌గా తీసుకొద్దుము`” అని ఓ స్టేట్‌మెంట్ విసిరాడు నాగార్జున‌. ఈ ఒక్క మాట‌… `దేవ‌దాస్`పై ఉన్న పాజిటీవ్ బ‌జ్‌కి జ‌ర్క్ వ‌చ్చేలా చేసింది. నాగ్ ఇలా మాట్లాడాడేంటి? అంటూ చిత్ర‌బృందంలోని అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. ఈ మాట‌ల‌కు ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ ఆదిత్య కూడా కాస్త కినుక వ‌హించాడు. అయితే ఇప్పుడు నాగ్ న‌ష్ట‌నివార‌ణా చ‌ర్య‌లు చేప‌ట్టాడు. త‌న తాజా ట్విట్ లో దేవ‌దాస్ చూశాను. ఓ హిట్ సినిమాని జేబులో వేసుకుని… హాలీడేస్‌కి వెళ్తున్నా అంటూ రాసుకొచ్చాడు. ఇంత మంచి చిత్రాన్ని అందించిన వైజ‌యంతీ మూవీస్‌కీ, త‌న‌తో పాటు ప‌ని చేసిన నానీకి, ఈ సినిమా తీసిన ద‌ర్శ‌కుడికీ థ్యాంక్స్ చెప్పుకొచ్చాడు. ఓ విధంగా నిన్న‌టి కామెంట్‌కి ఇది ఆయింట్‌మెంట్ రాయ‌డం లాంటిదే. నాగ్ ఈ సినిమా ఇప్పుడు చూడ‌డ‌మేంటి? మొన్నే చూశా.. అని తానే స్వ‌యంగా చెబితే? అప్ప‌టికీ, ఇప్ప‌టికీ ఈ సినిమాలో వచ్చిన మార్పేంటో నాగార్జున‌కే తెలియాలి. ఓ సినిమా విడుద‌ల‌కు ముందు కాస్త నెగిటీవ్‌గా మాట్లాడ‌డం.. సినిమాకే కాదు, ఆ సినిమా కోసం ప‌ని చేసిన టెక్నీషియ‌న్ల‌కూ ఇబ్బంది తెచ్చి పెడుతుంది. ఆ త‌ర‌వాత ఇలాంటి క‌వ‌రింగులు ఎన్ని చేసినా లాభం లేదు. మ‌రి నాగ్ ట్వీట్‌లో ఎంత నిజ‌ముందో తెలియాలంటే ఇంకొన్ని గంట‌లు ఆగితే స‌రిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close