నమితకు టీటీడీ మర్యాదలు సరిపోలేదా..!?

తిరుమల తిరుపతి దేవస్థానంలో అసలు పరిస్థితులేమీ బాగోలేదని నటి నమిత.. ఆమె భర్త మీడియా ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగులందరూ భయం భయంగా ఉన్నారని.. అసలు ఎక్కడా ఓ పద్దతి పాడు లేకుండా పోయిందని మండిపడ్డారు. అంతటితో ఊరుకోలేదు… గతంలో పని చేసిన అధికారులపై ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో జేఈవోగా శ్రీనివాసరాజు ఉండేవారు. ఆయనను గుర్తు చేసుకున్న నమిత ఆయన హయాంలో తిరుమలలో అన్ని వ్యవహారాలు స్మూత్‌గా జరిగిపోయేవని చెప్పుకొచ్చారు. సహజంగానే సెలబ్రిటీలు… ఏమైనావ్యతిరేకంగా స్టేట్‌మెంట్లు ఇస్తే హైలెట్ అవుతాయి. అలా నమిత స్టేట్‌మెంట్ కూడా హైలెట్ అయిపోయింది.

తిరుమలకు వచ్చే సెలబ్రిటీలు …తమకు సేవలు సరిగ్గా అందకపోతే… విమర్శలు చేయడం సినీ తారలకు కామన్ అయిపోయింది. వాళ్ల మాటలకు మీడియా కూడా అటెన్షన్ ఇస్తుంది కాబట్టి.. టీటీడీ వర్గాలు కూడా వీలైనంత వరకూ ఆ సెలబ్రిటీలకు మర్యాదలు చేసి పంపుతూ ఉంటారు. కానీ అన్నీ సార్లు సాధ్యం కాదు. ఒక్కో సారి ఒక్కో సెలబ్రిటీ అతిగా ఊహించుకుని .. సేవలు అందలేదని విమర్శలు ప్రారంభిస్తారు. ఇలాంటి పరిస్థితే ఇప్పుడు నమిత విషయంలో టీటీడీ అధికారులకు ఎదురయిందని అంటున్నారు. అయితే నమితకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇచ్చి దర్శనం చేయించామని.. అయినా ఆమె ఎందుకు అసంతృప్తి వ్యక్తంచేసిందో తెలియడం లేదని టీటీడీ వర్గాలు గొణుక్కుంటున్నాయి.

టీటీడీకి ప్రస్తుతం పాలక మండలి లేదు. ఈవో, డిప్యూటీ ఈవోలతోనే స్పెసిఫైడ్ అధారిటీ ఉంది. దీంతో టీటీడీ బోర్డు సభ్యుల సిఫార్సు లేఖలు పని చేయడం లేదు. వారు ఉండి ఉంటే.. ఎవరో ఒకరి సిఫార్సుతో నమిత వచ్చేవారేమో.. అప్పుడు టీటీడీ వర్గాలు ఆమెకు తగినంత ప్రాధాన్యత ఇచ్చి.. దర్శనం చేయించేవేమో కానీ.. ఇప్పుడు మాత్రం… ఆమె సాధారణ దర్శనం చేసుకోవాల్సి వచ్చింది. ఆలయ అధికారులు కూడా పెద్దగా పట్టించుకోలేదంటున్నారు. అందుకే ఆమెకు కోపం వచ్చి.. వ్యతిరేక స్టేట్‌మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close