మహేష్ వారసుడు ఈసారి హీరోగా వస్తాడు!

ఘట్టమనేని కుటుంబంలో మూడో తరం వారసుడు సిల్వ‌ర్‌స్క్రీన్‌పైకి వచ్చాడు. సూప‌ర్‌స్టార్ కృష్ణ మ‌న‌వ‌డు, మ‌హేష్‌బాబు కుమారుడు గౌత‌మ్‌ `వన్ నేనొక్కడినే`లో నటించాడు. మళ్లీ ఎప్పుడు నటిస్తాడా… గౌత‌మ్‌ని సిల్వ‌ర్‌స్క్రీన్‌పై మళ్లీ ఎప్పుడు చూస్తామా అని ఘట్టమనేని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మహేష్ వారసుడు ఈసారి హీరోగా వస్తాడు. రావడం దాదాపు ఖాయమే.

పెళ్లి రోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్ మళ్లీ ఎప్పుడు నటిస్తాడని నమ్రతను అడగ్గా “ఒకవేళ హీరో అయితే అయినప్పుడు“ అని చెప్పారు. ఇప్పుడే గౌతమ్ హీరో అవుతాడని చెప్పడం తొందరపాటు అవుతుందనీ, గౌత‌మ్‌ని తాము హీరోగా చూడాల‌నుకుంటున్నామనీ, గౌత‌మ్ కూడా హీరో అవుతాన‌ని అంటున్నాడ‌నీ, ఏం జరుగుతుందో చూద్దామనీ నమ్రత అన్నారు. బాల నటుడిగా తండ్రి కృష్ణ సినిమాల్లో నటించిన మహేష్, తరవాత హీరో అయ్యాడు. అలాగే, గౌతమ్ కూడా తండ్రి మహేష్ సినిమాలో బాల నటుడిగా కనిపించి హీరోగా రావడానికి సిద్ధమవుతున్నాడన్నమాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ‘లేడీస్ స్పెష‌ల్’

ముందు నుంచీ... విభిన్న‌మైన దారినే వెళ్తున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. త‌ను ఎంచుకొనే ప్ర‌తీ క‌థా... తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓవ‌ కొత్త జోన‌ర్ ని ప‌రిచ‌యం చేసింది. 'హ‌నుమాన్' తో పాన్ ఇండియా క్రేజ్...

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close