న‌మ్ర‌త ఇప్పుడు మేల్కొంది

ఈమ‌ధ్య ఏ సినిమాకీ రానంత నెగిటీవ్ టాక్ బ్ర‌హ్మోత్స‌వంకి చుట్టుకొంది. ఆ ప్ర‌భావం సినిమా వసూళ్ల‌పై విప‌రీతంగా ప‌డింది. ఎలాగున్నా చూద్దాం అనుకొన్న‌వాళ్లు సైతం డ్రాప‌యిపోయారు. ఓ ఇంగ్లీషు ప‌త్రిక‌… బ్ర‌హ్మోత్స‌వంపై ఇచ్చిన నెగిటీవ్ ప‌బ్లిసిటీ అంద‌రికీ షాకిచ్చింది. ఇంత నెగిటీవ్ టాక్ వ‌స్తుంద‌ని చిత్ర‌బృందం అస్స‌లు ఊహించ‌లేక‌పోయింది. ఇక‌నైనా ఈ విష ప్ర‌చారం ఆపాల‌ని న‌మ్ర‌త నిర్ణ‌యించుకొంద‌ని, అందుకే రంగంలోకి దిగి మీడియా బాస్‌ల‌తో మాట్లాడుతోంద‌ని టాక్‌. నిజానికి బ్ర‌హ్మోత్స‌వం ప్ర‌చార బాధ్య‌త‌ను న‌మ్ర‌త‌నే తీసుకొంది. విడుద‌ల‌కు ముందు ఈసినిమాకి వ‌చ్చిన హైప్ అంతా ఇంతా కాదు. అలా హైప్ రావ‌డానికి న‌మ్ర‌త తీసుకొన్న జాగ్ర‌త్త‌లు, వేసిన వ్యూహాలే కీల‌క పాత్ర పోషించాయి.

అయితే సినిమా ఫ‌లితం దారుణంగా బెడ‌సి కొట్ట‌డంతో నెగిటీవ్ టాక్ విజృంభించింది. తేరుకొనేలోగా ఈ సినిమాపై నెగిటీవ్ టాక్ అంత‌టా పాకేసింది. రోజురోజుకీ.. అది పెరుగుతూ పోవ‌డం ప‌ట్ల మ‌హేష్ బాబు కూడా అస‌హ‌నం వ్య‌క్తం చేశాడ‌ని తెలుస్తోంది. సినిమా పోతే పోయింది.. కనీసం వెబ్ మీడియాలో, ప్రింట్ మీడియాలో వ‌స్తున్న ఈ టాక్‌ని ఆపాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. అందుకే మ‌ళ్లీ న‌మ్ర‌త‌ రంగంలోకి దిగి.. ఈ ప్ర‌చారం ఆప‌డానికి విశ్వ ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. సినిమా వ‌చ్చింది. ఫ్లాప్ అయ్యింది.. ఇప్పుడు ఎంత చేసినా ఏం లాభం?? పోయిన ప‌రువు తిరిగి రాదు క‌దా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close