నంది అవార్డ్స్ : గంప‌గుత్త‌గా ఇచ్చేస్తే ఇలానే ఉంటుంది

గ‌తంలో నంది అవార్డులు ప్ర‌క‌టించారంటే ఆ హ‌డావుడే వేరుగా ఉండేది. ఎవ‌రు బెస్ట్ యాక్ట‌ర్‌, ఏది బెస్ట్ ఫిల్మ్‌? అనే విష‌యాల‌పై చ‌ర్చ బాగా న‌డిచేది. సోష‌ల్ మీడియా బాగా యాక్టీవ్ అయిపోయిన ఇలాంటి త‌రుణంలో… నంది అవార్డులు ప్ర‌క‌టించిన మ‌రుక్ష‌ణం ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌లు షేకైపోవాలి. కానీ అదేం జ‌ర‌గ‌లేదు. నంది అవార్డులు ప్ర‌క‌టించారంటే ప్ర‌క‌టించారంటూ… లైట్ తీసుకొన్నారు. ఫ్యాన్స్ చేసే హ‌డావుడి కూడా ఏం లేదు. వ‌రుస‌గా మూడేళ్ల‌వి ఒకేసారి ఇవ్వ‌డంతో నంది క్రేజ్ బాగా త‌గ్గిపోయిన‌ట్టు క‌నిపిస్తోంది. మీడియా కూడా అంత విస్ర్కృతంగా ప్ర‌చారం చేయ‌లేదు. పైగా ఈసారి నంది విష‌యంలో నెగిటీవ్ కామెంట్స్ ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. ‘మాకు నంది వ‌చ్చిందోయ్‌’ అంటూ సంతోషంగా ట్వీట్ చేసిన‌వాళ్లుగానీ, ఫేస్ బుక్‌లో ఆనందాన్ని పంచుకొన్న‌వారు గానీ, మీడియా ముందుకొచ్చి ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం గానీ జ‌ర‌గ‌డం లేదు. దీన్ని బ‌ట్టి.. `నంది` స్థాయి ఎంత ప‌డిపోయిందో ఊహించొచ్చు.

అవార్డుల‌న్నీ ఒకేసారి ఇస్తే ఇలానే ఉంటుంది. క‌నీసం జాతీయ అవార్డుల‌నైనా విడిగా ప్ర‌క‌టిస్తే కాస్త విలువైనా వ‌చ్చేది. ఇప్పుడు అవార్డుల ప్ర‌దానం కూడా ఒకేసారి గంప‌గుత్త‌గా చేసేయాల‌న్న‌ది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ నిర్ణ‌యం. జ‌న‌వ‌రిలో అందుకు ముహూర్తం సెట్ చేశారు. ఒకేసారి మూడు సంవ‌త్స‌రాల అవార్డులు, అందులోనూ జాతీయ పుర‌స్కారాలు ఒకే వేడుక‌పై ఇవ్వ‌డం బాగానే ఉన్నా.. దాన్నీ ఏదో తూతూ మంత్రంగానే న‌డిపేస్తారేమో అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. మ‌హేష్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, బాల‌కృష్ణ‌, చిరంజీవి లాంటి స్టార్స్ అవార్డులు అందుకోబోతున్నారు. వీళ్ల‌లో స‌గం మంది గైర్హాజ‌రు అయ్యే ప్ర‌మాదం కూడా క‌నిపిస్తోంది. అవార్డుల `పంప‌కం` సక్ర‌మంగానే చేసిన ప్ర‌భుత్వం – ఇప్పుడు అందించ‌డంలో ఎలాంటి హ‌డావుడి చేస్తుందో చూడాలి. ఇక‌నైనా ఏ యేడాది అవార్డులు ఆ యేడాదే ప్ర‌క‌టిస్తే బాగుంటుంది. లేదంటే… మొక్కుబ‌డి వ్య‌వ‌హారంలా త‌యార‌య్యే ప్ర‌మాదం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ వాతావరణ శాఖ

వేసవిలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న హైదరాబాద్ ప్రజలకు కాస్త ఊరట లభించింది. శనివారం ఉదయం నుంచి నగరంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రతి రోజూ వడగాడ్పులతో...

విజ‌య్ పాత లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు తీస్తారా?

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'డియ‌ర్ కామ్రేడ్‌', 'ఖుషి' చిత్రాల తాలుకూ క‌మ‌ర్షియ‌ల్ రిజ‌ల్ట్ ఏమిటి? ఈ సినిమాల వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోయారా, లాభ‌ప‌డ్డారా? ఈ లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు రాబోతున్నాయి. విజ‌య్...

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close