నంద్యాల కౌంట్‌ డౌన్‌.. మారిన ట్యూన్‌..

నంద్యాలలో మేమంటే మేమే గెలుస్తామని టిడిపి వైసీపీలు ఘంటాపథంగా చెబుతున్నా ఎవరి అభద్రత వారిని వెన్నాడుతున్నది. జగన్‌ పది రోజులు మకాం చేయడం, ముఖ్యమంత్రి చంద్రబాబు చివరి రెండు రోజులు గడపడం ఇందుకో ఉదాహరణ మాత్రమే. పైగా ముఖ్యమంత్రి రోడ్‌షోలే గాక కుల మత సమావేశాలు కూడా జరిపి సంబంధిత హామీలు కురిపించారు. శాసనమండలికి ముస్లింను చైర్మన్‌ను చేస్తామని చెప్పడం ద్వారా ఫరూక్‌కు పదవీ ప్రసాదం చేసినట్టే. ఇక ఎప్పుడో దాడికి గురైన ముస్లిం కుటుంబాన్ని తీసుకొచ్చి ఎన్నికల్లో మాట్లాడకూడదంటూనే న్యాయం చేస్తామని హామీలిచ్చారు. నిన్నటి వరకూ తమ పార్టీలో వున్న శిల్పా మోహనరెడ్డి సహకార సంఘం చట్టబద్దమైంది కాదని, చర్యలు తీసుకుంటామనికొత్తగా హెచ్చరించారు. మరోవైపున ముఖ్యమంత్రి ప్యాంట్రీ కారును తనిఖీ చేయడమేమిటని ఎన్నికల సంఘానికి టిడిపి ఫిర్యాదు చేసింది. అయితే ఇవన్నీ వున్నా విధుల నిర్వహణ సరిగా లేదని డిఎస్‌పి గోపాలకృష్ణను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. 3500 పోలీసులను పోలింగ్‌కు పంపిస్తున్నది. కొద్ది మంది తెలుగుదేశం నేతలను కూడాడబ్బు పంపిణీ కేసుల్లో పోలీసులు అనివార్యంగా అరెస్టు చేయవలసి వచ్చింది. బాలయ్య డబ్బులు పంచుతున్న విడియోను కూడా తీవ్రంగానే పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే అది ఎన్నికల్లోగా తేలదు.

వైసీపీ నేతలు కూడా డబ్బులు పంచడం, బెట్టింగుల కేసులను ఎదుర్కొంటున్నారు. పోలీసుల తమపైనే దాడి చేస్తూ అధికార పక్షాన్ని వదిలేస్తున్నారని వైసీపీ ఫిర్యాదు చేస్తున్నది. ప్రధాన నేతల ప్రచార శైలిలో పెద్ద మార్పు లేదు గాని ఎంపి మేకపాటి రాజమోహనరెడ్డి మాత్రం భూమా కుటుంబం పట్ల సానుభూతి భాషలో మాట్లాడ్డం కొత్త పరిణామం.చంద్రబాబు గతంలో హరికృష్ణను వాడుకుని వదిలేసినట్టే అఖిల ప్రియకూ జరుగుతుందని చెప్పడం ద్వారా కొంత సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. నంద్యాల ఉప ఎన్నిక రెఫరెండం లాటిదని పదే పదే అనడం సరికాదని కూడా వైసీపీలో ఆలోచన మొదలైంది. ఎన్నికలు ఇంకా రెండేళ్లు వుండగా ముందే ముద్ర వేయించుకోవడమెందుకుని కొందరు ప్రశ్నించారట. బహుశా రాజ్‌మోహనరెడ్డి వ్యాఖ్యలు దీనంతటి పలితమే కావచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close