‘గ్యాంగ్ లీడ‌ర్’ గొడ‌వ గురించి నాని ఏమ‌న్నాడు?

నాని – విక్ర‌మ్ కె.కుమార్ కాంబినేష‌న్‌లో ‘గ్యాంగ్ లీడ‌ర్‌’ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ టైటిల్ పై వివాదం రాజుకుంది. `ఇది మా టైటిల్‌` అని ఓ నిర్మాత ఛాంబ‌ర్‌లో ఫిర్యాదు చేశాడు. ‘గ్యాంగ్ లీడ‌ర్‌’ పేరుతో ఓ చిన్న సినిమా ఇటీవ‌లే ప‌ట్టాలెక్కేసింది కూడా. ఈ రెండింటిలో ఏ సినిమాకి ‘గ్యాంగ్ లీడ‌ర్‌’ టైటిల్ ద‌క్కుతుందో అనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

ఈ వివాదం గురించి నాని స్పందించాడు. తన వ‌ర‌కూ ఈ గొడ‌వ రాలేద‌ని, నిజానికి ఈ క‌థ‌కు గ్యాంగ్ లీడ‌ర్ అనే పేరు త‌ప్ప మ‌రేదీ సూట్ అవ్వ‌ద‌ని క్లారిటీ ఇచ్చాడు నాని. “గ్యాంగ్ లీడ‌ర్ సినిమాకి నేను పెద్ద అభిమానిని. ఆ క‌థ‌కూ, విక్ర‌మ్ సినిమాకీ ఎలాంటి సంబంధం ఉండ‌దు. కానీ… ఈ క‌థ‌కు గ్యాంగ్ లీడ‌ర్ అనే పేరు మిన‌హా మ‌రేదీ మ్యాచ్ కాదు. ఈ సినిమా చూశాక‌… ‘గ్యాంగ్ లీడ‌ర్‌’ కంటే బెట‌ర్ టైటిల్ ఉండ‌ద‌ని ప్రేక్ష‌కులే చెబుతారు. అప్ప‌టికీ ”ఈ సినిమాకి గ్యాంగ్ లీడ‌ర్ అనే పేరు అవ‌స‌రం లేద‌ని ఎవ‌రైనా చెబితే క‌నుక‌.. టైటిల్ మార్చేస్తాం” అంటున్నాడు. సినిమా విడుద‌ల‌య్యాక టైటిల్ మార్చ‌డం అంటూ ఉంటుందా?? నాని ఏదో ఫార్మాలిటీకి ఇలా చెప్పుంటాడు అంతే. అస‌లు ఇంత గొడ‌వెందుకు… ‘గ్యాంగ్ లీడ‌ర్’ అనే పేరుకి ముందు నాని.. అని పెడితే స‌రిపోతుంది. టైటిల్ వివాదాల‌న్నీ ఇలానే స‌ద్దుమ‌ణిగాయి క‌దా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close