ఓజీలాంటి సూపర్ డూపర్ సక్సెస్ కొట్టిన దర్శకుడు సుజిత్. `ఓజీ 2` గురించి పవన్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెంచుకొన్నారు. అయితే ఈలోగా నానితో ఓ సినిమా చేయాలి సుజిత్. దానికి `బ్లడీ రోమియో` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కాన్సెప్ట్ టీజర్ కూడా వదిలారు. కానీ.. సినిమా మాత్రం సెట్స్‌పైకి వెళ్లలేదు. ముందు అనుకొన్న ప్రకారం అయితే… ‘ప్యారడైజ్’ ఈపాటికే విడుదల అయిపోవాలి. మార్చి 26న రిలీజ్ డేట్ అనుకొన్నారు. కానీ కుదర్లేదు. ఈ సినిమా ఆలస్యం అయ్యే కొద్దీ `బ్లడీ రోమియో` కూడా లేట్ అవుతూ వెళ్తుంది. ఎందుకంటే నాని `పారడైజ్` లో ఓ గెటప్ లో ఉన్నాడు. బ్లడీ రోమియో కోసం మరో గెటప్ లోకి మారాలి. కాబట్టి.. `పారడైజ్` అయ్యేంత వరకూ ఈ సినిమా మొదలవ్వదు. మరోవైపు ‘పారడైజ్’ సినిమా ఆలస్యమవుతూ వెళ్తోంది. ఆగస్టులో పారడైజ్ వస్తుందనుకొన్నారు. కానీ అప్పటికీ వీలు కాదని తెలుస్తోంది. యేడాది చివర్లో గానీ, 2027లో గానీ ‘పారడైజ్` వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. అప్పటి వరకూ సుజిత్ ఖాళీగానే ఉండాలి. లేదంటే నాని తో సంబంధం లేని సన్నివేశాల్ని షూట్ చేసుకోవాలి.
కాకపోతే సుజిత్ దగ్గర ఓ ఆప్షన్ ఉంది. ఈలోగా ఓ చిన్న సినిమా పూర్తి చేసుకోవడం. లేదంటే ఓజీ 2’ స్క్రిప్టు రెడీ చేయడం. సుజిత్ దేన్ని ఎంచుకొంటాడో చూడాలి. హీరోలు గెటప్పులు వేసుకొంటే ఇదే ఇబ్బంది. ఒకేసారి రెండు సినిమాల్ని చేయలేరు. ఓ సినిమా నుంచి పూర్తిగా బయటకు వస్తే తప్ప.. మరో సినిమా మొదలెట్టలేరు. అందుకే సుజిత్ కాస్త ఇబ్బంది పడుతున్నాడు.
