నాని బాధ‌ని ఇప్పుడైనా అర్థం చేసుకుంటారా?

ట‌క్ జ‌గ‌దీష్ సినిమాని ఓటీటీలో విడుద‌ల చేయ‌డం… స్వ‌త‌హాగానే ఎగ్జిబీట‌ర్ల‌కు న‌చ్చ‌లేదు. వాళ్ల ఆగ్ర‌హ ఆవేశాలు బాహాటంగానే వెళ్ల‌గ‌క్కారు. నాని సినిమాల్లో మాత్ర‌మే హీరో అని – బ‌య‌ట విల‌న్ అని ఎట‌కారం చేశారు. నాని సినిమాల్ని థియేట‌ర్లో బ్యాన్ చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

ఇవ‌న్నీ నాని మ‌న‌సుకు గుచ్చుకోకుండా ఉంటాయా? నాని నొచ్చుకోకుండా ఉంటాడా? త‌న బాధ‌ని ట‌క్ జ‌గ‌దీష్ ట్రైల‌ర్ లాంచ్ ఫంక్ష‌న్‌లో వెళ్ల‌గ‌క్కాడు. థియేట‌ర్ల ప‌రిస్థితులు బాగాలేవ‌ని, అందుకే ఓటీటీకి వెళ్లాల్సివ‌చ్చింద‌ని, తాను కూడా బాధితుడినే అంటూ త‌న బాధ‌ని పంచుకున్నాడు. ప‌రిస్థితులు బాగున్న‌ప్పుడు త‌న సినిమాని ఓటీటీకి ఇస్తే.. త‌నని తానే బ్యాన్ చేసుకుంటాన‌ని నాని ప్ర‌క‌టించాడు. ఎగ్జిబీట‌ర్ల బాధ‌ని తాను అర్థం చేసుకోగ‌ల‌ని, కాక‌పోతే.. ఆ సంద‌ర్భంలో త‌న‌ని ప‌రాయివాడ్ని చేయ‌డం బాధించింద‌ని చెప్పాడు. నాని బాధ‌ని అర్థం చేసుకోవాల్సిందే. ట‌క్ జ‌గ‌దీష్ సినిమాని థియేట‌ర్లో విడుద‌ల చేయ‌డానికి నాని ఓ మినీ సైజు పోరాటం చేశాడు. ఓటీటీలో ఈ సినిమాని విడుద‌ల చేయ‌డం త‌న‌కీ న‌చ్చ‌లేదు. `వి` సినిమా ఓటీటీకి వెళ్ల‌డం వ‌ల్ల ఏం జ‌రిగిందో నానికి తెలుసు. మ‌ళ్లీ అలాంటి త‌ప్పు చేయ‌డానికి నాని ఎందుకు సాహ‌సిస్తాడు? పైగా ట‌క్ జ‌గ‌దీష్ ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఉన్న సినిమా. ఇలాంటి సినిమాని థియేట‌ర్ల‌లోనే చూడాలి. కాక‌పోతే.. నిర్మాత‌ల బాధ‌ని తానూ అర్థం చేసుకోవాలి. వాళ్ల క‌ష్టాల్ని పంచుకోవాలి. అందుకే విధిలేక ఓటీటీకి ఒప్పుకోవాల్సివ‌చ్చింది. నాని బాధ‌ని ఇక‌నైనా ఎగ్జిబీట‌ర్లు అర్థం చేసుకుంటారో లేదో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అయితే పోతిన లేకపోతే పోసాని – పిచ్చెక్కిపోతున్న వైసీపీ !

పవన్ కల్యాణ్ రాజకీయంతో వైసీపీకి దిక్కు తోచని పరిస్థితి కనిపిస్తోంది. ఆయనపై కసి తీర్చుకోవడానికి వ్యక్తిగత దూషణలు.. రూమర్స్ ప్రచారం చేయడానికి పెయిడ్ ఆర్టిస్టుల్ని ప్రతీ రోజూ రంగంలోకి తెస్తున్నారు. గతంలో పోసాని...

టాలీవుడ్ మార్కెట్ పెంచుకుంటున్న కన్నడ స్టార్

ఈ మధ్య భాషా బేధాలు లేకుండా అన్ని భాషలకి చెందిన సూపర్ స్టార్స్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే క్రేజీ కాంబినేషన్స్ వర్కౌట్ అవుతున్నాయి. కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్...

కేసీఆర్ కు ఏమైంది..?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రసంగం అనగానే తెలంగాణ ప్రజలంతా చెవులు రిక్కించి వినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇదంతా గతం. అధికారం కోల్పోయాక ఆయన ప్రసంగంలో మునుపటి వాగ్ధాటి కనిపించడం లేదనే అభిప్రాయాలు...

బొత్స తండ్రి సమానుడా ? : షర్మిల

వైఎస్ జగన్ బొత్సను తన తండ్రి సమానుడు అని అనడం.. ఆయన విచిత్రమైన హావభావాలతో కంట తడిపెట్టుకున్నట్లుగా నటించడం, తర్వాత కాళ్లకు దండం పెట్టే ప్రయత్నం చేయడం విజయనగరం సిద్ధం సభలో కనిపించిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close