డిసెంబ‌రు 1న నాని సినిమాకి క్లాప్‌

ప్ర‌స్తుతం ‘వీ’ సినిమాతో బిజీగా ఉన్నాడు నాని. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌కుడు. ఈలోగా మ‌రి కొన్ని కొత్త క‌థ‌లు వింటున్నాడు. తాజాగా శివ నిర్వాణ చెప్పిన క‌థ‌కు నాని ప‌చ్చ జెండా ఊపాడు. స్క్రిప్టు సైతం సిద్ధ‌మైంది. డిసెంబ‌రు 1న ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభిస్తారు. జ‌న‌వ‌రిలో షూటింగ్ మొద‌ల‌వుతుంది. శివ నిర్వాణ‌తో ‘మ‌జిలీ’ తెర‌కెక్కించిన స‌న్‌షైన్ పిక్చ‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సాహు గార‌పాటి, శిరీష్ పెద్ది నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ‘నిన్ను కోరి’, ‘మ‌జిలీ’లా ఇది కూడా రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌రే అని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే క‌థానాయిక‌, ఇత‌ర న‌టీన‌టుల పేర్లు ప్ర‌క‌టిస్తారు. ఈ చిత్రానికి కూడా గోపీ సుంద‌ర్ సంగీతం అందించే అవ‌కాశాలున్నాయి. ‘నిన్నుకోరి’, ‘మ‌జిలీ’ చిత్రాల‌కు గోపీనే స్వ‌ర‌క‌ర్త‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close