నాని – విక్ర‌మ్‌… బ‌డ్జెట్‌ రూ.50 కోట్లా?

నాని రేంజు అంత‌కంత‌కూ పెరుగుతోంద‌న్న‌ది వాస్త‌వం. `జెర్సీ`కి ప్రీ రిలీజ్ బిజినెస్సే రూ.35 కోట్ల వ‌ర‌కూ జ‌రిగింది. విడుద‌ల‌కు ముందే నిర్మాత‌ల‌కు లాభాలు తెచ్చిపెట్ట‌డం నాని సినిమాల‌కు ఆన‌వాయితీగా మారింది. అయితే… ఎంత బిజినెస్సు బాగున్నా, నిర్మాత‌ల‌కు లాభాలు వ‌స్తున్నా – త‌న మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ విష‌యంలో నాని నిర్మాత‌లు మ‌రీ ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌కి పోతున్నారేమో అనిపిస్తోంది. నాని – విక్ర‌మ్ కెకుమార్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. ఈ సినిమా బ‌డ్జెట్ అక్ష‌రాలా రూ.50 కోట్ల‌ని స‌మాచారం. `జెర్సీ`కి రూ.35 కోట్ల బిజినెస్ జ‌రిగింది. ఏ నిర్మాత అయినా.. త‌న హీరో గ‌త చిత్రం చేసిని బిజినెస్ ని దృష్టిలో ఉంచుకునే బ‌డ్జెట్ కేటాయించుకుంటాడు. కానీ మైత్రీ మూవీస్ మాత్రం రూ.15 కోట్లు అద‌నంగా పెట్టేసింది. విక్ర‌మ్ కె.కుమార్ గురించి తెలియందేమీ లేదు. త‌న సినిమాలు కొత్త పంథాలో ఉంటాయి. సినిమా బాగుంది, అనే టాక్ వ‌చ్చినా, క‌మ‌ర్షియ‌ల్‌గా ఆడ‌ని సంద‌ర్భాలు చాలా ఉన్నాయి. తాజా చిత్రం `హ‌లో` నిర్మాత‌ల‌కు న‌ష్టాల‌నే మిగిల్చింది. ఈనేప‌థ్యంలో నాని సినిమాని మైత్రీ మూవీస్ 50 కోట్లు బ‌డ్జెట్ కేటాయించ‌డం సాహ‌సోపేత‌మైన నిర్ణయ‌మే అని చెప్పాలి. `జెర్సీ` విడుద‌లై భారీ లాభాలు తెచ్చిపెట్టి, `నాని సినిమాని కొని తీరాల్సిందే` అని బ‌య్య‌ర్లు అనుకుంటే త‌ప్ప‌… విడుద‌ల‌కు ముందే ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్ ద‌క్కించుకోవ‌డం క‌ష్టం. ఇది మైత్రీ మూవీస్‌కి కూడా తెలియ‌ని పాయింటేం కాదు. అయినా స‌రే రిస్కు చేస్తున్నారంటే… బ‌ల‌మైన కార‌ణ‌మేదో ఉండే ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

ప్రచారంలో పొలిటికల్ గ్లామర్ ఏదీ..?

ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు....

ఎవరీ రామసహాయం రఘురామ్ రెడ్డి..?

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని హైకమాండ్ ప్రకటించింది.అనేకపేర్లు తెరమీదకు వచ్చినా అనూహ్యంగా అధిష్టానం రామసహాయం పేరును అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఈయన ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది....

“సివిల్ సర్వీస్” ఇమేజ్ జగన్ పాలనలో డ్యామేజ్ !

సివిల్ సర్వీస్ అధికారి అంటే ఓ గౌరవం.. ఓ మర్యాద. కానీ ఏపీలో సివిల్ సర్వీస్ అధికారులు చేస్తున్న పనులు చూసి.. కోర్టులు కూడా అసలు మీకెవరు ఉద్యోగం ఇచ్చారయ్యా అని అసహనపడాల్సి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close