నాని చేస్తున్నది మహేష్ కథే

నానీస్ గ్యాంగ్ లీడర్ ఫుల్ స్వింగ్ లో నడుస్తోంది. ఈ సినిమా కథ ఇప్పటికే చూచాయిగా బయటకు వచ్చింది. నాని, నలుగురు మహిళలు, ఓ విలన్ వుంటారని, నాని రచయితగా నటిస్తున్నారని, ఆ మహిళల తరుపున వారికి న్యాయం చేయడానికి రంగంలోకి దిగుతాడని వినిపిస్తోంది.

అయితే అసలు విషయం ఏమిటంటే, ఈ సినిమా కథ సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం తయారుచేసినదేనట. అప్పట్లో అశ్వనీదత్-విక్రమ్ కే కుమార్ కాంబినేషన్ లో మహేష్ తో ఓ సినిమా చేయడానికి స్క్రిప్ట్ వర్క్ చేసారు. చాలా సంప్రదింపుల తరువాత స్క్రిప్ట పూర్తయింది. అందులో విలన్ పాత్రను చాలా హై రేంజ్ లో తయారుచేసారట.

కానీ ఎందుకో మహేష్ ఆ సినిమా చేయలేదు. ఇప్పుడు అచ్చంగా ఆ కథనే, అలాగే నానితో చేస్తున్నాడట విక్రమ్ కే కుమార్. అందుకోసమే అశ్వనీదత్ కు భారీగా కాంపన్ సేషన్ కూడా ఇచ్చారని టాక్. అప్పట్లో విలన్ పాత్రను హైరేంజ్ లో తయారు చేయడంతో, ఇప్పుడు ఆ పాత్రను ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయకు ఇచ్చారు.

సినిమా ప్రారంభంలోనే నలుగురు మహిళల మర్డర్ ఎపిసోడ్ వుంటుందని తెలుస్తోంది. ఆ పైన దాని చుట్టూనే కథ తిరుగుతుందని టాక్ వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close