నాని Vs లారెన్స్‌…. వెన‌క్కి వెళ్లేదెవ‌రు..??

ఏప్రిల్‌లో కొత్త సినిమాల హవా ఎక్కువ‌గానే క‌నిపిస్తోంది. వారానికి ఒక సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర సంద‌డి చేయ‌బోతోంది. ఏప్రిల్ 19న మాత్రం రెండు సినిమాలు ఢీ కొట్ట‌బోతున్నాయి. అటు నాని `జెర్సీ`, ఇటు లారెన్స్ `కాంచ‌న 3` ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. నిజానికి నానికి లారెన్స్ సినిమా పోటీ కాదు. కానీ… నాని వ‌సూళ్ల‌కు కళ్లెం వేసే స్టామినా మాత్రం లారెన్స్ సినిమాకి ఉంటుంది. గ‌తంలో వ‌చ్చిన లారెన్స్ హార‌ర్ చిత్రాలు బాక్సాఫీసు ద‌గ్గ‌ర కాసుల వ‌ర్షం కురిపించుకున్నాయి. సీ సెంట‌ర్ల‌లో లారెన్స్ సినిమాల‌కు మంచి ఓపెనింగ్స్ వ‌స్తుంటాయి. సో.. నానికి సోలోగా వ‌చ్చే ఎడ్వాంటేజ్‌కి కాంచన 3 గండి కొడుతున్న‌ట్టే అనుకోవాలి. నాని `జెర్సీ` సినిమా మే 1కి వాయిదా ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని, అందుకే… ఏప్రిల్ 19న వ‌స్తున్నామ‌ని `కాంచ‌న 3` వ‌ర్గాలు చెబుతున్నాయి. తెలుగు తమిళ భాష‌ల్లో ఒకేసారి `కాంచ‌న 3` విడుద‌ల అవుతోంది. అందుకే రిలీజ్ డేట్ విష‌యంలో ప‌క్కాగా ఉండాల్సిందే. నాని సినిమా వెన‌క్కి వెళ్తుంద‌న్న ధీమాతోనే కాంచ‌న 3 రిలీజ్‌డేట్ ఫిక్స్ చేసుకుంది. ఒక‌వేళ నాని సినిమా వాయిదా ప‌డ‌క‌పోతే మాత్రం `కాంచ‌న 3` వెన‌క్కి వెళ్ల‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ రెండింటిలో ఏం జ‌రుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close