రివ్యూ : కిచిడి లాంటి క‌థ‌తో.. నాన్న నేను నా బోయ్ ఫ్రెండ్స్‌

ఈమ‌ధ్య కాలంలో.. పోస్ట‌రు చూసి సినిమా చూడాల‌నుకోవ‌డం బ‌హుశా – నాన్న, నేను, నా బోయ్‌ఫ్రెండ్స్ విష‌యంలోనే సాధ్య‌మైంద‌నుకొంటా! హెబ్బా ప‌టేల్ గ్లామ‌ర్‌, దిల్‌రాజు బ్రాండ్‌, టైటిల్‌… ఇవ‌న్నీ యువ‌త‌ని ఎక్ట్రాక్ట్ చేసేవే! ఇది బొమ్మ‌రిల్లు లాంటి సినిమా అంటూ దిల్‌రాజు కూడా అదే ప‌నిగా చెవిలో పోరెట్ట‌డంతో `నిజంగానే దీనికి అంత సీన్ ఉందేమో` అనుకొంటూ థియేట‌ర్లో వాలిపోతారు. మ‌రి… ఈ సినిమా ఎలా ఉంది? దిల్‌రాజు బ్రాండ్‌కి స‌రితూగిందా, నాన్న‌కీ, బోయ్ ఫ్రెండ్స్‌కీ మ‌ధ్య ఈ క‌థ ఎలా త‌యారైంది? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

* క‌థ‌

రాఘ‌వ‌రావు (రావు ర‌మేష్‌)కి లేక‌లేక పుట్టిన కూతురు ప‌ద్మావ‌తి (హెబ్బా ప‌టేల్‌). ప‌ద్దూ పుట్టిన‌ప్పుడే జ్యోతిష్యుడు `నీకు శ‌త్రువు పుట్టింది.. నువ్వు ఎడ్డం అంటే త‌ను తెడ్డెం అంటుంది` అంటూ వార్నింగ్ ఇస్తాడు. `నేను నో చెబితేనేక‌దా గొడ‌వ‌… అందుకే తాను చెప్పిన‌దానిక‌ల్లా త‌లాడిస్తా` అనుకొంటాడు రాఘ‌వ‌రావు. అలానే అల్లారు ముద్దుగా పెంచుతాడు. ఇంజ‌నీరింగ్ ఫెయిల్ అయినా స‌రే, కూతురు ఆనందం కోసం `పాస్ అయ్యావ్‌` అని అబ‌ద్ద‌మాడి, కూతురి కోరిక‌పైనే ప‌ట్నం పంపుతాడు. ప‌ద్మావ‌తికి ఓ మంచి సంబంధం చూస్తే.. `నేను ఆల్రెడీ ల‌వ్‌లో ఉన్నా. అబ్బాయి ఆరు నెల‌ల్లో అమెరికా నుంచి ఇండియా వ‌స్తాడు` అని అబ‌ద్దం చెబుతుంది. ఆరు నెలల్లో అబ్బాయి తిరిగి రాక‌పోతే.. నేను చెప్పిన సంబంధమే చేసుకోవాల‌ని ష‌ర‌తు పెడ‌తాడు రాఘ‌వ‌రావు. అందుకోసం ఆరు నెల‌ల్లోగా ఓ అబ్బాయిని ప్రేమించి నాన్న ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లాల‌ని ఫిక్స‌వుతుంది ప‌ద్మావ‌తి. అందుకోసం ముగ్గురు అబ్బాయిల్ని (అశ్విన్, పార్వ‌తీశం, నోయెల్‌)ని వెదుకుతుంది. ఆ ముగ్గురిలో ఒక‌ర్ని ఎంచుకొని, త‌న‌నే పెళ్లి చేసుకోవాల‌నుకొంటుంది. ఈ ముగ్గురికీ పెట్టిన ప్రేమ‌ ప‌రీక్ష‌ల్లో ముగ్గురికీ స‌మాన‌మైన మార్కులొస్తాయి. ముగ్గురిలో ఎవ్వ‌రినీ ఇబ్బంది పెట్ట‌డం ఇష్టం లేక ముగ్గురికీ ఐల‌వ్ యూ చెప్పేస్తుంది. మ‌రి నిజానికి ప‌ద్దూ మ‌న‌సులో ఉన్న‌దెవ‌రు? ఎవ‌రిని పెళ్లి చేసుకొంది? అనేది తెర‌పై చూడాల్సిందే.

* తెలుగు 360 విశ్లేష‌ణ‌

ఈ సినిమా ప‌క్కా యూత్ ఫుల్ స్టోరీ. దానికి `నాన్న‌` అనే ట్యాగ్ లైన్ తగిలించి ఫ్యామిలీస్‌ని కూడా ఆక‌ట్టుకొనే ప్ర‌య‌త్నం చేశారు. నిజానికి నాన్న పాత్ర అతికించిన‌ట్టే ఉంటుంది. సినిమాకి ముందూ… ఆఖ‌ర్లోనూ నాన్న ప్ర‌త్య‌క్ష్యం అవుతాడంతే. అయితే.. తండ్రీ కూతుర్ల అనుబంధం నేప‌థ్యంలో వ‌చ్చిన సీన్లు బాగానే రాసుకోవ‌డంతో ఆ ప్ర‌య‌త్నం వ‌ర్క‌వుట్ అయ్యింది. అస‌లు క‌థ‌లోకి వెళ్తే.. ముగ్గురు అబ్బాయిల్ని త‌న ప్రేమ కోసం మోసం చేసిన అమ్మాయి క‌థ ఇది. హీరోయిన్ కాబ‌ట్టి `మోసం` అని అన‌కూడ‌దు. ఆ ఆట ఆడిందంతే! నిజానికి ద‌ర్శ‌కుడు అనుకొన్న పాయింటే.. చాలా సున్నిత‌మైంది. ఎందుకంటే ఓ అమ్మాయి.. ప్రేమ పేరుతో ముగ్గురితో ఆట‌లాడుకోవ‌డం ఏమిటి? వాళ్ల కెరీర్‌నే నాశ‌నం చేసుకొనేలా చేయ‌డం ఏమిటి? దీన్ని ఏ తండ్రి మాత్రం స‌మ‌ర్థిస్తాడు? ముగ్గురి జీవితాలతో ల‌వ్ గేమ్ ఆడేశాక‌.. `నా కూతురు చేసిందేం త‌ప్పు కాదు` అన్న‌ట్టు ఓ తండ్రి మాట్లాడ‌డం స‌వ్యంగా అనిపించ‌దు. ఆ పాయింట్‌ని ప‌క్క‌న పెడితే.. సినిమా అంతా టైమ్ పాస్ వ్య‌వ‌హార‌మే అన్న‌ట్టు సాగుతుంది. అక్క‌డ‌క్క‌డ కొన్ని సీన్లు ఆక‌ట్టుకొన్నా.. ఆ మ‌ధ్య‌లో న‌డిపించిన డ్రామా తేలిపోయింది. ముగ్గురు అబ్బాయిల్ని ఓ అమ్మాయి ఒకేసారి ప్రేమించ‌డం… అన్న పాయింట్ చుట్టూ న‌డిపిన సీన్ల‌న్నీ పాత‌వే. మ‌ళ్ల మ‌ధ్య సృష్టించిన కామెడీ ఆఫ్ ఎర్ర‌ర్స్ స‌రిగా వ‌ర్క‌వుట్ కాలేదు. సెకండాఫ్‌లో వ‌చ్చిన అంత్యాక్ష‌రి ఎపిసోడ్ అయితే ప‌రాకాష్ట‌. సినిమాని సాగ‌దీయ‌డం ఎలాగో తెలీక‌.. ద‌ర్శ‌కుడు ఈ పాయింట్‌ని ఎత్తుకొన్నాడు. ప‌తాక స‌న్నివేశాలతో సినిమా కాస్త గాడిన ప‌డింద‌నుకొంటే క‌థానాయిక అక్క‌డ కూడా తాను చేసింది స‌మ‌ర్థించుకోవ‌డానికే చూస్తుంటుంది. మూడేళ్ల వ‌య‌సులో ఓ పిల్లాడు నీట్లో కొట్టుకుపోతున్న పాప‌ని కాపాడ‌డం ఏమిటి? అక్క‌డే హీరోలా డైలాగులు చెప్ప‌డం ఏమిటి? ఆ సీన్ల‌న్నీ ఫోర్డ్స్‌గా, కృత్రిమంగా సాగాయి. అయితే హెబ్బా టీజ్ చేసే సీన్లు, సినిమా క్వాలిటీ, పాట‌లు, అక్క‌డ‌క్క‌డ కొన్ని డైలాగులు… ఇవ‌న్నీ కాస్త న‌డిపించ‌గ‌లిగాయి.

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

రావుర‌మేష్ మ‌రోసారి ఉత్త‌మ తండ్రిగా ఆక‌ట్టుకొన్నాడు. కూతురి పై ప్రేమ‌ని వ్య‌క్త‌ప‌రిచే సంద‌ర్భంలో రావు న‌ట‌న‌.. హైలెట్ అని చెప్పుకోవాలి. హెబ్బా గ్లామ‌ర్ ఈ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. నోయెల్‌ని ఏడిపించే సంద‌ర్భంలో సెక్సీగా, అల్ల‌రిగా న‌టించింది. కొన్ని కొన్ని చోట్ల‌… టూమ‌చ్ మేక‌ప్ తో ద‌ర్శ‌న‌మిచ్చింది. ఒక్కో ఫ్రేములో ఒకోలా క‌నిపించ‌డం ఏమిటో..?? హెబ్బా క‌న్నా కొన్ని షాట్ల‌లో తేజ‌స్విని అందంగా క‌నిపించింది. నోయెల్‌, అశ్విన్‌, పార్వ‌తీశం బాగానే చేసినా.. వాళ్ల పాత్ర‌ల‌కు అంత స్కోప్ లేదు. ఈ పాత్ర‌ల కోసం నోటెడ్ ఆర్టిస్టుల్ని ఎంచుకొంటే బాగుండేది.

* సాంకేతిక వ‌ర్గం

టెక్నిక‌ల్‌గా ఈ సినిమా బాగుంది. `ఒక పారూ ముగ్గురు దేవ‌దాసులు` మంచి మాస్ బీట్‌. ఆఖ‌ర్లో వ‌చ్చే శాడ్ సాంగ్ సినిమాకి అన‌వ‌స‌రం. చోటా కెమెరా వ‌ర్క్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పేదేముంది? డైలాగులు అక్క‌డ‌క్క‌డ మెరిశాయి. ఓవరాల్ గా ఓకే. ద‌ర్శ‌కుడు అటు మాస్‌నీ ఇటు యూత్‌నీ.. వాళ్ల‌తో పాటు ఫ్యామిలీకీ న‌చ్చే సినిమా తీద్దామ‌నుకొన్నాడు. దాంతో సినిమా ముక్క‌లుముక్కులుగా అయిపోయింది. సెకండాఫ్ చూస్తే `జ‌బ‌ర్‌ద‌స్త్‌` లోని కొన్ని స్కిట్స్‌ని క‌లిపి చూసిన‌ట్టే అనిపించింది. క‌థ రొటీన్ కావ‌డం, దాని కోసం రాసుకొన్న స్క్రీన్ ప్లే ఇంకా రొటీన్ గా ఉండ‌డం.. ఈ సినిమాకి అతి ప్ర‌ధాన మైన మైన‌స్‌లు.

* ఫైన‌ల్ ట‌చ్‌:

ఈ సినిమాని దిల్‌రాజు బొమ్మ‌రిల్లుతో పోల్చాడు. అలాంటి ఎక్స్‌పెక్టేష‌న్ల‌తో వెళ్తే… చాలా చాలా నిరాశ ప‌డ‌డం ఖాయం. హెబ్బా కోస‌మో… కొన్ని కామెడీ స్కిట్ల కోస‌మో అయితే.. ఓకే.

తెలుగు360 రేటింగ్: 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close