లోకేష్ 100 డేస్ ఛాలెంజ్ విన్నారా..?

ఐటీ, పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రిగా నారా లోకేష్ కొత్త‌గా బాధ్య‌త‌లు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. టీడీపీ నేత‌లు ఆశించిన‌ట్టుగానే ఆయ‌న మంత్రి అయ్యారు. ఇప్పుడు, త‌న‌కు అప్ప‌గించిన శాఖ‌ల్లో అద్భుత విజ‌యాలు సాధించే దిశ‌గా అడుగులు వేయాల్సిన సంద‌ర్భం ఇది. ఈ క్ర‌మంలో యువ‌త‌ను ఆక‌ర్షించేందుకు మంత్రి నారా లోకేష్ సిద్ధ‌మౌతున్నారు.

రాబోయే 100 రోజుల్లో ఆంధ్రాకి ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున రాబోతున్నాయ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. వ‌చ్చే మూడు నెల‌ల్లో ప్ర‌ముఖ కంపెనీల‌ను ఏపీకి తీసుకుని రావ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్టు చెప్పారు. విజ‌య‌వాడ‌లో ఓ సాఫ్ట్ వేర్ సంస్థ కార్యాల‌యం ప్రారంభించిన మంత్రి, ఈ విష‌యాన్ని తెలిపారు. రాష్ట్రంలో యువ‌త‌కు మ‌రిన్ని ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌బోతున్నామ‌ని అన్నారు. వ‌చ్చే రెండేళ్ల‌లో ఐటీ రంగాన్ని గ‌ణ‌నీయంగా అభివృద్ధి చేసేందుకు కావాల్సిన ప్రణాళిక‌లు సిద్ధం చేసుకున్నామ‌ని లోకేష్ చెప్పారు. ఆంధ్రా యువ‌త‌కి ఈ గ‌డ్డ మీదే ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని, రెండేళ్ల‌లో ల‌క్ష ఉద్యోగాలు రాబోతున్నాయంటూ కొత్త ఆశ‌లు రేకెత్తించారు. వీటితోపాటు ఎల‌క్ట్రానిక్ మ్యానిఫ్యాక్చ‌రింగ్‌, ఆటో మొబైల్స్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగావ‌కాశాలు వ‌స్తాయని చెప్పారు.

మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకున్న త‌రువాత యువ‌త‌ను టార్గెట్ చేసుకున్న‌ట్టున్నారు లోకేష్‌. వ‌చ్చే వంద‌రోజుల్లో పెద్ద ఎత్తున కంపెనీల‌ను తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తా అని ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిక‌రంగా ఉంది. ఇంత‌కీ లోకేష్ ధీమా ఏంటో తెలీదుగానీ… గ‌డ‌చిన మూడేళ్లుగా సాధించిలేనిది, వంద రోజుల్లో చేసి చూపిస్తా అన‌డం బాగానే ఉంది. నిజానికి, బాబు వ‌స్తే జాబు వ‌స్తుంద‌ని గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం భారీగానే ప్ర‌చారం చేసుకుంది. నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని కూడా బాగానే ఆక‌ట్టుకున్నారు. అధికారంలోకి వ‌చ్చి ఇన్నాళ్లు అవుతున్నా ఆ జోలికే వెళ్లలేదు. యువ‌త‌.. ఉపాధి.. అనే టాపిక్స్ గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దీంతో యువ‌త‌లో కొంత వ్య‌తిరేక‌త పెరిగిన మాట వాస్త‌వం.

ఇప్పుడు.. నారా లోకేష్ వ్యూహ‌మంతా యువ‌త‌ను ఆక‌ర్షించ‌డంపైనే ఉంది! ల‌క్ష‌ల సంఖ్యలో ఉద్యోగాలు రాబోతున్నాయంటూ బాగానే ఆశ చూపారు. మ‌రీ ఆ స్థాయిలో రాక‌పోయినా క‌నీసం కొన్ని వేల‌ల్లో అయినా ఉద్యోగాలు ల‌భిస్తే యువ‌త‌కు కొంత ఊర‌ట‌గా ఉంటుంది. మ‌రి, చిన‌బాబు టార్గెట్ అయిన రాబోయే వంద‌రోజుల్లో ఎన్ని సంస్థ‌లు వ‌స్తాయో.. కొత్త‌గా ఎంత‌మందికి ఉపాధి ల‌భిస్తుందో వేచి చూద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close