వైసీపీ నేతలు ఇక మారరని మరోసారి రుజువు అయింది. సమయం, సందర్భం అదేమీ పట్టించుకోకుండా రెచ్చిపోయారు. వైసీపీ నేత జోగి రమేశ్ ఇంట్లో ఇటీవల జరిగిన ఓ శుభకార్యానికి హాజరైన నేతలు, కార్యకర్తలు అక్కడికి ఓ చిన్నపిల్లాడి సైకిల్ తీసుకొచ్చి తుక్కుతుక్కు చేసి ఏదో సాధించామన్నట్టుగా రాక్షసానందం పొందారు. దీన్ని వైసీపీ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తుండగా..ఈ వీడియోలో ఉన్న వైసీపీ నాయకుల మానసిక పరిస్థితిని చూసి జనాలు ముక్కువ వేలేసుకున్నారు. మంత్రి నారా లోకేష్ కూడా దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు.
ఇలాంటి చేష్టలు చూసే సైకో అని పేరు పెట్టామంటూ లోకేష్ ధ్వజమెత్తారు. సైకో అనే పేరు సార్థకం చేసుకోవడానికి నిరంతరం పని చేస్తూనే ఉంటారన్నారు. ఎప్పటికీ వైసీపీ ఓ సైకో పార్టీ అని ఫైర్ అయ్యారు. వాళ్ల నాయకుడు ఓ సైకో ! ప్రజలు బుద్ధి చెప్పినా మారని వాళ్ళ ఆలోచనలకు ఇది నిదర్శనం. చిన్న పిల్లవాడి నుండి సైకిల్ లాక్కొని దాన్ని రోడ్డుపై గిరగిరా తిప్పి, తొక్కుతూ విరగ్గొడుతూ వాళ్ళు చేస్తున్న వికృత చేష్టలను సమాజం అర్థం చేసుకోవాలానే తాను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానని నారా లోకేష్ తెలిపారు.
లోకేష్ ట్వీట్ కు కౌంటర్ గా వైసీపీ సోషల్ మీడియా ట్వీట్లు చేసింది కానీ, అడ్డంగా దొరికిపోయింది. గతంలో ఎన్నికల సమయంలోని టీడీపీ నేతల వీడియోలను తాజాగా పోస్ట్ చేశారు. ఎన్నికల వేళ సహజంగా పోస్ట్ చేస్తారు. కానీ, ఎన్నికలు దరిదాపుల్లో లేని ఈ సమయంలో ఇలాంటి పిల్ల చేష్టలు చేయడం పట్ల వైసీపీపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ నేతలకు అధికారం కోల్పోయినా బలుపు తగ్గలేదని అనేందుకు ఈ వీడియోనే నిదర్శనమని పేర్కొంటున్నారు. ఇలాంటి వాటితో స్వయం సంతృప్తి పొందవచ్చు కానీ, జనాల మెప్పును పొందలేరు. ఈ విషయం మాత్రం వైసీపీ నేతలుగ్రహించడం లేదు.