ప‌వ‌న్ ఆరోప‌ణ‌ల‌కు మంత్రి నారా లోకేష్ కౌంట‌ర్‌..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆరోప‌ణ‌ల గురించి తెలిసిందే..! అంద‌రూ అంటున్నారు కాబ‌ట్టి, తానూ అనేస్తున్నా అంటారు. అంద‌రూ అనుకోవ‌డం వేరు, దాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన‌డం వేరు క‌దా. రెంటికీ చాలా తేడా ఉంది క‌దా! ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌జా పోరాట యాత్ర ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో కొన‌సాగుతోంది. ఈ యాత్ర మొద‌లుపెట్టిన ద‌గ్గ‌ర నుంచీ రాష్ట్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు, టీడీపీ ప‌నితీరుపై ఆరోప‌ణ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వాటిలో ఒక తాజా విమ‌ర్శ‌.. రియ‌ల్ ఎస్టేట్ కంపెనీల‌కు భూములకు భూముల్ని ప్ర‌భుత్వం క‌ట్ట‌బెడుతోంద‌ని! విజ‌య‌న‌గ‌రంలో ప‌వ‌న్ ఈ మ‌ధ్య‌నే మాట్లాడుతూ…. ‘శ్రీకాకుళం నుంచి ఒక వ్య‌క్తి భూమి కోసం అప్లై చేస్తే వారికి ఇవ్వ‌లేదు, ఎక్క‌డో ఒక ఫ్రాంక్లిన్ టెంపుల్ట‌న్ అనే వ్య‌క్తికి రూ. 30 ల‌క్ష‌ల‌కు ఎక‌రం ఇచ్చారు. వారు ప‌దిహేను కోట్ల‌కు అమ్ముకుంటున్నారు ఎక‌రం’ అంటూ వ్యాఖ్యానించారు. వాస్త‌వానికి ఫ్రాంక్లిన్ టెంపుల్ట‌న్ అనే పేరు వ్య‌క్తిది కాదు.. అదో అంత‌ర్జాతీయ సంస్థ‌!

ఈ విమ‌ర్శ‌ల‌పై మంత్రి నారా లోకేష్ తాజాగా ట్వీట్ చేశారు. పవన్ వ్యాఖ్యల వీడియో షేర్ చేస్తూ.. ఫ్రాంక్లిన్ టెంపుల్ట‌న్ అనేది ఒక రియ‌ల్ ఎస్టేట్ సంస్థ కాద‌ని మంత్రి అన్నారు. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో అదీ ఒక సంస్థ అని చెప్పారు. ఈ కంపెనీ ఆంధ్రాలో రూ. 250 కోట్ల పెట్టుబ‌డులు పెట్టి, 2500 మందికి ఉద్యోగాలు ఇవ్వ‌బోతోంద‌ని వివ‌రించారు. విశాఖ‌లో ఏర్పాటు చేయ‌బోతున్న ఈ సంస్థ‌కి సీయీవో శ్రీ‌కాకుళం నివాసే అని చెప్పారు. శ్రీ‌కాకుళం జిల్లాలో స్థానిక యువ‌తీ యువ‌కుల‌కు ఉద్యోగాలు క‌ల్పించేలా ఈ కంపెనీ ఏర్పాటు కాబోతోంద‌ని అన్నారు. స్థానిక యువ‌త‌కిగానీ, స్థానిక పారిశ్రామికవేత్త‌ల‌కుగానీ ఎక్క‌డా ఎలాంటి అన్యాయం జ‌ర‌గడం లేద‌ని లోకేష్ స్ప‌ష్టం చేశారు.

నిజానికి, ఫ్రాంక్లిన్ టెంపుల్ట‌న్ ను ఒక వ్య‌క్తి అని ప‌వ‌న్ నోరుజార‌డంపై సోష‌ల్ మీడియాలో సెటైర్లు బాగానే ప‌డుతున్నాయి. మ‌రి, ప‌వ‌న్ కు స్థానిక స‌మ‌స్య‌ల‌పై స‌మాచారం అందిస్తున్న‌ది ఎవ‌రోగానీ.. ఇలాంటి విష‌యాల‌పై మ‌రింత స్ప‌ష్ట‌త ఇస్తే బాగుంటుంది. తోటప‌ల్లి రిజ‌ర్వాయరు గురించి ఇలానే నోరుజారి ప‌నులు పూర్తి కాలేద‌న్నారు! కానీ, చాలా గ్రామాల‌కు ఈ రిజ‌ర్వాయ‌రు నుంచి నీళ్లు వెళ్తున్నాయి. శ్రీ‌కాకుళంలో కూడా ఇలానే.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మ‌చ్చ‌లేని నాయ‌కుడిగా మంచిపేరున్న గౌతు శివాజీపై కూడా విమ‌ర్శ‌లు చేయ‌డం స్థానికంగా చ‌ర్చ‌నీయాంశమైన సంగ‌తీ తెలిసిందే. ఇలా మాట జారుడు అధిక‌మౌతుంటే.. ఇది పవ‌న్ అవ‌గాహ‌నా రాహిత్యం అనే విమ‌ర్శ‌లు పెరుగుతాయి క‌దా! విమ‌ర్శ‌లూ ఆరోప‌ణ‌ల విష‌యంలో కొంత ప‌రిశీల‌న‌, ప‌రిశోధ‌న‌, స‌మ‌గ్ర స‌మాచార సేక‌ర‌ణ వంటివి చేసుకుంటే మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close