కట్జూ కొశ్ఛన్స్‌కి బాబు, లోకేష్ దగ్గర సమాధానం ఉందా?

అధికారంలో ఉన్నాం….అన్నీ మేనేజ్ చెయ్యొచ్చు, ఏం చేసినా ఎవ్వరూ విమర్శించకూడదు అని చెప్పి ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటే ఎలా? రాజుల కాలంలో అయితే ప్రభువులవారి చేతిలోనే సర్వాధికారాలు ఉంటాయి కాబట్టి ఏం చేసినా చెల్లిపోయింది. అఫ్కోర్స్ అప్పుడు కూడా కాస్తంత ప్రజాదరణ పొందినవాళ్ళే ఎక్కువ కాలం మనగలిగారనుకోండి. ఇప్పుడు ఆ ప్రభువుల కాలం పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చాయి. అధికారంలో ఉన్నవాళ్ళకు, అన్నీ తెలుసు అనుకుంటున్నవాళ్ళకు, ప్రపంచానికే పాఠాలు చెప్పాం అనుకుంటున్న వాళ్ళకు అర్థం కావడం లేదు కానీ ఇది రాజుల కాలం కాదు. ప్రజాస్వామ్యం. ప్రజలే ప్రభువులు. పాలకులే సేవకులు. పాలకులు తమను తాము చాలా ఎక్కువ ఊహించుకుని, ఆ పదవులకు రాజ్యాంగంలో ఇచ్చిన అతిపెద్ద గౌరవాన్ని తమకు అన్వయించుకుంటూ మమ్ములనే విమర్శిస్తారా అని రెచ్చిపోయి ప్రభువులయిన ప్రజలనే అరెస్టులు చేసే ధైర్యం చేస్తున్నారు. రాజ్యాంగంలో ఉన్న విలువలు, చట్టాలకు కట్టుబడి పదవీ నిర్వహణ చేస్తే ఎవరెన్ని విమర్శలు చేసినా ఎవ్వరికీ కోపం రాదు. అలాగే ప్రజల్లో కూడా చెడ్డపేరు రాదు. కానీ ఇష్టారీతిన చేసుకుంటూ పోతాం…ఎవరైనా విమర్శిస్తే తమ చేతిలో ఉన్న పోలీసుల చేత అరెస్టులు చేయిస్తాం అంటే ఎలా? ఇది ప్రజాస్వామ్యమనుకుంటున్నారా? రాజరికం అనుకుంటున్నారా? లేక అధికార మైకంలో పడి ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలనే మరిచిపోతున్నారా?

ఇప్పుడు ఇవే విషయాలను ఇంతకంటే ఘాటుగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ లేవనెత్తారు. ఏకంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయమని రాష్ట్రపతి, ప్రధానమంత్రలుకు లేఖలు రాశాడు. చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియాలో యాంటీ కామెంట్స్, కార్టూన్స్ పోస్ట్ చేశారని చెప్పి అరెస్ట్ చేయడం అంటే పౌరులకు ఉన్న ఫ్రీడం ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ హక్కును కాలరాయడమే అని విమర్శలు చేశాడు కట్జూ. రాష్ట్రపతి, ప్రధానమంత్రులకు కట్జూ రాసిన లేఖతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సోషల్ మీడియా అరెస్టులు జాతీయ ఇష్యూ అయిపోయాయి. అంతా జగనే చేయిస్తున్నాడు అన్న ఓ రొటీన్ ప్రకటన ఇచ్చే కార్యక్రమాన్ని టిడిపి నాయకులు ఎలాగూ చేస్తారు. కానీ విషయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో అలాంటి సిల్లీ స్టేట్మెంట్స్‌తో పనవ్వడం కష్టమే. సోషల్ మీడియాను నియంత్రించే విషయంలో చంద్రబాబు, లోకేష్‌ల అత్యుత్సాహంపై ఆదిలోనే చాలా విమర్శలు వచ్చాయి. కానీ లోకేష్ మాత్రం అస్సలు తగ్గలేదు. ఆ అత్యుత్సాహమే ఇప్పుడు జాతీయ స్థాయిలో ఇబ్బందికర పరిస్థితులను, ఇమేజ్ డ్యామేజ్ అయ్యే విమర్శలను తెచ్చిపెట్టింది. చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవా అని అందరూ అనుకునేలా సంకటస్థితి ఎదురైన నేపథ్యంలో ముందు ముందు అయినా చంద్రబాబు, లోకేష్‌బాబులు దిద్దుబాటు చర్యలు చేపడతారో…..లేక ఇంకా దూకుడుగా వెళ్ళి ఎదురుదెబ్బలు తింటారో చూడాలి మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.