భీమిలి నుంచే లోకేష్..!

ఎన్నికల ప్రకటనకు ముందే అభ్యర్థిత్వాలను చంద్రబాబు దాదాపుగా ఖరారు చేస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేశారు. ఎవరి సంగతి ఎలా ఉన్నా ఏపీ రాజకీయ వర్గాల దృష్టి మాత్రం లోకేష్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే అంశంపైనే నెలకొంది. ఈ సస్పెన్స్‌కు దాదాపుగా తెర పడింది. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ యుద్ధంలో టీడీపీని విపక్షాలు టార్గెట్‌ చేసేది చంద్రబాబు తర్వాత లోకేశ్‌నే. సమయం, అవకాశం వచ్చినప్పుడల్లా లోకేశ్‌ ఎన్నికల బరిలో దిగాలంటూ ప్రత్యర్థులు సవాల్ విసురుతుంటారు. ఇప్పుడు వీటన్నింటికీ చెక్‌ పెట్టేందుకు లోకేష్‌ సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు.

కుప్పం నుంచి పోటీ చేయాలని చంద్రబాబు లోకేష్‌కు సూచించారు. కానీ కోస్తా లేదా ఉత్తరాంధ్ర నుంచి బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు.. దీనితో లోకేష్‌ కోసం అనువైన నియోజకవర్గాలను పార్టీ శ్రేణులు అన్వేషించాయి. గుంటూరు జిల్లా పెదకూరపాడు, కృష్ణా జిల్లా పెనుమలూరుతోపాటు విశాఖ జిల్లా భీమిలిని పార్టీ శ్రేణులు సూచించాయి. వీటిలో భీమిలి నుంచి పోటీ చేసేందుకు లోకేష్‌ ఆసక్తి చూపించారు. రాజకీయంగా భీమిలిలో టీడీపీ తిరుగులేని విజయాలు సాధించింది. 1983 నుంచి ఎన్నికల ఫలితాలను చూస్తే 2004,2009లో మాత్రమే ఓడిపోయింది. భీమిలిలో టీడీపీ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. పలు ఐటీ సంస్థలు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ తరహాలో మిలియనీం టవర్స్‌ను కూడా నిర్మించారు. ఐఐఎంను కూడా భీమిలిలోనే నిర్మిస్తున్నారు. అదానీ గ్రూప్‌ ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్‌ కూడా భీమిలి నియోజకవర్గ పరిధిలోకే వస్తుంది.

కుల రాజకీయాలకు అతీతంగా.. తన నియోజకవర్గం ఉండాలని.. లోకేష్ భావిస్తున్నారు. తన సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉన్న చోట పోటీ చేస్తే విమర్శలు వస్తాయి. అందుకే.. తన సామాజికవర్గం పెద్దగా లేని చోట… ఆయన బరిలోకి దిగబోతున్నారు. లోకేష్ నిర్ణయం.. ఇతర పార్టీల ముఖ్య నేతల్ని చిక్కుల్లో నెట్టే అవకాశం ఉంది. వారు కూడా.. తమ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా లేని చోట పోటీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయని పోటీ చేస్తే.. విమర్శలు వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close