నారా వారి ‘చేప‌ల పులుసు’

స‌రికొత్త క‌థ‌ల‌తో, పాత్ర‌ల‌తో ఎంట‌ర్‌టైన్ చేస్తున్నాడు నారా రోహిత్‌. న‌ట‌న‌, నిర్మాణ‌మే కాదు, త‌న‌లో ఇంకో టాలెంట్ ఉంది. అదేంటో తెలుసా?? వంట‌లు వండ‌డం. రోహిత్ చేయి తిరిగిన వంట‌గాడ‌ట‌. మ‌రీ ముఖ్యంగా చేప‌ల పులుసు బ్ర‌హ్మాండంగా చేస్తాడ‌ట‌. త‌న చేతి వంట రుచి, వంట ప్రావిణ్యం సెట్లోనూ చూపించేశాడు. నారా రోహిత్ కొత్త సినిమా ‘శ‌మంత‌క‌మ‌ణి’. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుగుతోంది. సెట్లో… చేప‌ల పులుసు చేయ‌బోతున్నార‌న్న సంగ‌తి తెలుసుకొని, వంట గ‌దిలోకి వెళ్లిపోయాడు నారా రోహిత్‌. త‌నే ద‌గ్గ‌రుండి మ‌రీ చేప‌ల పులుసు చేసి పెట్టాడు. రోహిత్ వండిన చేప‌ల పులుసు… చిత్ర బృందం మొత్తం లొట్ట‌లు వేసుకొంటూ తిన్న‌ద‌ట‌.ఆ విడియోని శ‌మంత‌క‌మ‌ణి టీమ్ విడుద‌ల చేసింది. శ్రీ‌రామ్ ఆదిత్య తెర‌కెక్కించిన ఈచిత్రంలో ఆది, సందీప్ కిష‌న్‌, సుధీర్‌బాబు క‌థానాయ‌కులుగా న‌టిస్తున్నారు. వ‌చ్చే నెల‌లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close