పూరితో సినిమా చేయ‌ట్లేద‌ట‌

నారా రోహిత్ – పూరి జ‌గ‌న్నాథ్‌ల కాంబినేష‌న్లో సినిమా వ‌స్తోందంటే ఎవ్వ‌రూ ఆశ్చ‌ర్య‌పోలేదు. ఎందుకంటే పూరి జ‌గ‌న్నాథ్ ప‌రిస్థితి అలా ఉందిప్పుడు. స్టార్ హీరోలెవ‌రు పూరితో సినిమా చేయ‌డానికి సిద్ధంగా లేరు… వాళ్ల‌కు ఖాళీ అంత‌కంటే లేదు. అందుకే నారా రోహిత్‌తో సినిమా వ‌ర్క‌వుట్ చేసుకొన్నాడేమో అనుకొన్నారంతా. అయితే నారా రోహిత్ – పూరిల సినిమా అస‌లు లేనేలేద‌ట‌. ఇదంతా ఎవ‌రో కావాల‌ని పుట్టించిన పుకారు అంటున్నాడు నారా రోహిత్‌.

”మా ఇద్ద‌రి కాంబినేష‌న్లో ఓ సినిమా వ‌స్తోందంటూ వార్త‌లొచ్చాయి. అవి నేనూ విన్నా. కాక‌పోతే.. అలాంటి ప్ర‌పోజ‌ల్ ఏదీ నా ద‌గ్గ‌ర‌కు రాలేదు. వ‌స్తే పూరితో త‌ప్ప‌కుండా చేస్తా” అంటున్నాడు. అంటే అదంతా గాలివార్తే అన్న‌మాట‌. నారా రోహిత్ క‌థానాయకుడిగా న‌టించిన రాజా చేయివేస్తే ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సినిమాలో ద‌ర్శ‌కుడు కావాల‌ని కల‌లుక‌నే ఓ కుర్రాడి పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ట రోహిత్‌. ఈ సినిమాపై రోహిత్ చాలా హోప్స్ పెట్టుకొన్నాడు. మ‌రి ఎలాంటి రిజ‌ల్ట్ వ‌స్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close