నారా రోహిత్ కొత్త చిత్రం ‘కథలో రాజకుమారి’!

వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ.. ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రామిసింగ్ హీరో నారా రోహిత్ నటించనున్న నూతన చిత్రం కథలో రాజకుమారి త్వరలో ప్రారంభం కానుంది. కార్తికేయ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని నిర్మించిన మాగ్నస్ సినీప్రైమ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత వెంకట శ్రీనివాస్ బొగ్గారం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గారం తెలియజేస్తూ.. “కార్తికేయ లాంటి సూపర్ హిట్ తరువాత మళ్ళీ అంతకుమించిన సక్సెస్ ఫుల్ చిత్రం నిర్మించాలనే ఆలోచనతో ఓ నవ్యమైన కథతో ఈ చిత్రానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ చిత్రం ద్వారా మహేష్ సూరపనేని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. హీరో క్యారెక్టరైజేషన్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. నారా రోహిత్ సరసన నమితా ప్రమోద్ హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించడం మా అద్రుష్టంగా భావిస్తున్నాం. జనవరిలో షూటింగ్ ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కెమెరా: జయేష్ నాయర్, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఆర్ట్: సాహి సురేష్, సహా నిర్మాత: బీరం సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రవ సాయి సత్యనారాయణ, సమర్పణ: శిరువూరి రాజేష్ వర్మ, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: మహేష్ సూరపనేని, నిర్మాత: వెంకట శ్రీనివాస్ బొగ్గారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close