నర్సాపురం రివ్యూ : సామాజిక సమీకరణాలు నాగబాబుకు అనుకూలమా..?

నాగబాబు జనసేనలో నిన్ననే చేరినప్పటికీ.. కొంత కాలంగా.. నర్సాపురం లోక్‌సభ నుంచి ఆయన పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న కసరత్తు జనసేన పరంగా జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని సర్వేలు కూడా చేయించారని.. ఇతర ప్రధాన పార్టీలు అభ్యర్థుల్ని ఖరారు చేసిన తర్వాత… నాగబాబుకు మంచి అవకాశం ఉంటుందని అంచనాకు వచ్చినట్లుగా చెబుతున్నారు. నాగబాబు రంగంలో ఉండటంతో నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉండబోతోంది..? నాగబాబు రేసులో ఉంటారా..?

నర్సాపురంలో త్రిముఖ పోటీ ఖాయమైనట్లే..!

నర్సాపురంలో త్రిముఖ పోటీ ఖాయమయింది. నాగేంద్రబాబును రంగంలోకి దిగకపోతే… పోటీ రెండు పార్టీల మధ్యే ఉంటుందని అనుకునేవారు. కానీ.. నేరుగా నాగేంద్రబాబు రంగంలో ఉండటం.. ఈ నియోజకవర్గం పరిధిలోనే పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న భీమవరం కూడా ఉండటంతో… పోటీ ఆసక్తికరంగా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. నరసాపురం నియోజకవర్గంలో.. ఇటీవలి కాలంలో రాజకీయ పార్టీలన్నీ.. క్షత్రియసామాజికవర్గానికి ఎక్కువగా సీట్లు కేటాయిస్తూంటాయి. ఉభయగోదావరి జిల్లాలో వివిధ సామాజికవర్గాలకు అవకాశం కల్పించే క్రమంలో… నర్సాపురం వద్దకు వచ్చే సరికి.. అది క్షత్రియులకోటాలో పడిపోయేది. ఇప్పుడు కూడా ప్రధాన పార్టీలు.. అంటే.. టీడీపీ, వైసీపీ…క్షత్రియ సామాజికవర్గం అభ్యర్థులనే రంగంలోకి దింపాయి. టీడీపీ తరపున బరిలోకి దిగాల్సిన రఘురామకృష్ణంరాజు.. చివరి నిమిషంలో వైసీపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. దీంతో చంద్రబాబు మరింత వ్యూహాత్మకంగా ఆలోచించి.. క్షత్రియవర్గంలో మంచి పలుకుబడి ఉన్న ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజును… అభ్యర్థిగా నిర్ణయించారు.

ఇద్దరు రాజుల మధ్య కాపులు ఏకమవుతారా.. ?

పవన్ కల్యాణ్.. తన సోదరుడ్ని అదే నియోజకవర్గం నుంచి నిలబెట్టాలని నిర్ణయించారు. ఇది కూడా వ్యూహాత్మకమే. ఎందుకంటే.. గతంలో నర్సాపురం నుంచి కాపు సామాజికవర్గం నేతలు పలువురు విజయం సాధించారు. చేగొండి హరిరామజోగయ్య, కొత్తపల్లి సుబ్బారాయుడు లాంటి వాళ్లు.. కాంగ్రెస్, టీడీపీ తరపున పోటీ చేసి.. విజయం సాధించారు. పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాపు సామాజికవర్గం ఓటర్లు నిర్ణయాత్మకంగా ఉన్నారు. పైగా భీమవరం నుంచి నేరుగా పవన్ కల్యాణ్ రంగంలో ఉంటున్నారు. సామాజిక సమీకరణాల రీత్యా చూస్తే.. కాపు సామాజికవర్గం ఓటర్లు అంతా ఐక్యంగా… నాగబాబుకు మద్దతిస్తారని… అదే సమయంలో.. ఇతర ఓటర్లు.. టీడీపీ, వైసీపీ మధ్య చీలిపోతారన్న అంచనాలను.. జనసేన పార్టీ వ్యూహకర్తలు వేసినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే… నాగబాబును అక్కడ రంగంలోకి దించినట్లు ప్రచారం జరుగుతోంది…

భీమవరం నియోజకవర్గ కేర్‌టేకర్‌గా నాగబాబు..!?

నాగేంద్రబాబును నర్సాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దింపడానికి మరో కారణం.. భీమవరం నియోజకవర్గం. పవన్ కల్యాణ్ .. అక్కడ్నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో నామినేషన్ మాత్రం వేయగలరు. కానీ ప్రచారాన్ని.. ఇతర అంశాలను పట్టించుకోవడం కష్టమే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంచేయాల్సి ఉంది. గతంలో… చిరంజీవి ఇలాగే.. పాలకొల్లు నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసి.. ఇతర చోట్ల ప్రచారం చేశారు. కానీ ఫలితం తేడా కొట్టింది. ఎవరూ పట్టించుకోకపోవడమే కారణమన్న చర్చ నడిచింది. ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నా.. సరైన మెకానిజం లేకపోవడం వల్ల చిరంజీవి ఓటమి చవిచూడాల్సి వచ్చిందని చెప్పుకున్నారు. ఈ అనుభవంతో.. తన నియోజకవర్గాన్ని దగ్గరుండి చూసుకోవాలంటే.. నర్సాపురం నుంచి సోదరుడు బరిలో ఉండటమే మంచిదనే అంచనాకు పవన్ కల్యాణ్ వచ్చారని అనుకోవచ్చు..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close