ఒడిశా నుంచి మోడీ పోటీ… ఇది వ్యూహాత్మ‌క‌ ప్ర‌చార‌మా..?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒడిశాలోని పూరీ నుంచి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ పోటీ చేస్తార‌నే ప్ర‌చారం మెల్ల‌గా మొద‌లైన సంగ‌తి తెలిసిందే. అయితే, రెండ్రోజుల కింద‌ట ఎ.ఎన్.ఐ.కి ప్ర‌ధాని ఒక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. దీన్లో కూడా ఈ ప్ర‌స్థావ‌న వ‌స్తే… ఆయ‌న కొట్టి పారేశారు. ఇదంతా మీడియా సృష్టి అన్నారు. తాను ఎక్క‌డి నుంచి పోటీ చేసేదనే అంశంపై ప్ర‌త్యేకంగా ఎలాంటి నిర్ణ‌యాలూ తీసుకోలేద‌న్న‌ట్టుగా ఆయ‌న స్పందించారు. అయితే, మోడీ ఇంత స్ప‌ష్టంగా చెప్పిన‌ప్ప‌టికీ కూడా… ఆయ‌న పూరీ నుంచి పోటీ చేసే అవ‌కాశాలు చాలా ఉన్నాయంటూ ఒడిశాకు చెందిన భాజ‌పా ఎమ్మెల్యే ప్ర‌దీప్ పురోహిత్ మీడియా ముందుకు రావ‌డం విశేషం!

గత లోక్ స‌భ ఎన్నిక‌ల్లో కూడా పూరీ జ‌గ‌న్నాథుని ఆశీస్సులు తీసుకున్నాక‌నే వార‌ణాసి నుంచి మోడీ పోటీ చేసి ఘ‌న‌విజ‌యం సాధించార‌ని పురోహిత్ గుర్తు చేశారు. ఆయ‌న‌కు ఒడిశా ప్ర‌జ‌లంటే చాలా అభిమాన‌మ‌నీ, ఈ రాష్ట్ర అభివృద్ధిని ఆయ‌న ఎప్పుడూ కోరుకుంటూ ఉంటార‌ని పురోహితం చెప్పారు. ఒడిశా ప్ర‌జ‌లు కూడా ఈసారి మోడీ ఇక్క‌డి నుంచి పోటీ చేయాల‌ని బ‌లంగా కోరుకుంటున్నార‌నీ, రాష్ట్ర పార్టీ నేత‌లు కూడా ఇదే అంశాన్ని ఆయ‌న ముందుంచేందుకు మ‌రోసారి ప్ర‌య‌త్నిస్తామంటూ ఆయ‌న చెప్పుకొచ్చారు. ఒడిశా ప్ర‌జ‌ల ఆశ‌ల్ని ఆయ‌న అర్థం చేసుకుంటార‌నీ, నూటికి తొంభై శాతం పూరీ నుంచే మోడీ పోటీ ఉంటుంద‌ని పురోహిత్ చాలా నమ్మ‌కంగా చెప్పేశారు.

గ‌త ఎన్నిక‌ల్లో వారణాసి నుంచి పోటీ చేసి, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో అన్ని సీట్లూ భాజ‌పా గెలుచుకునేలా మోడీ చేశారు. కానీ, రాబోయే ఎన్నిక‌ల్లో మోడీ హ‌వా ఆ స్థాయిలో ఉండే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయి. పైగా, ఉత్త‌రప్ర‌దేశ్ లో భాజ‌పాకి అస్సలు అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌నే ఉద్దేశంతోనే అక్క‌డి రాజ‌కీయాలు ఈ మ‌ధ్య ఎలా మారుతున్నాయో చూస్తూనే ఉన్నాయి. ఎస్పీ, బీఎస్పీ ఈసారి భాజ‌పాకి గ‌ట్టిపోటీ ఇవ్వ‌డం ఖాయం. దీంతో, మ‌రోసారి ప్ర‌ధాని వార‌ణాసిలో పోటీ చేసి గెలిచినా, గ‌త ఎన్నిక‌ల్లో మాదిరిగా రాష్ట్రంలోని అన్ని లోక్ స‌భ స్థానాల్లో మోడీ ప్ర‌భావం మ‌రోసారి కొన‌సాగుతుంద‌నే న‌మ్మ‌కం ఆ పార్టీకి పూర్తిగా లేద‌ని చెప్పొచ్చు. కాబ‌ట్టి, మ‌రో టెంపుల్ టౌన్ కి మోడీ వెళ్లాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది. అదే, ఒడిశాకి వెళ్ల‌డం ద్వారా అక్క‌డా భాజ‌పా పుంజుకుంటుంద‌నే ఆశ‌లు ఆ పార్టీకి ఉన్నాయి. అందుక‌నే, పూరీ నుంచి పోటీ చేయాల‌నే డిమాండ్ ఒడిశా ప్ర‌జ‌ల నుంచే వ‌స్తోంద‌నే వాద‌న‌ను తెర‌మీదికి తెస్తున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల ద‌గ్గ‌ర‌ప‌డ్డాక, ప‌రిస్థితుల‌ను అప్పుడు క్షుణ్ణంగా అంచ‌నా వేసుకుని… అవ‌స‌ర‌మైతే పూరీ నుంచి పోటీ చేసే అవ‌కాశాన్ని ప్ర‌త్యామ్నాయ వ్యూహంలో భాగంగా రెడీ చేసి ఉంచుకుంటున్న‌ట్టుగా క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close