కీలక రంగాలలో కేటాయింపులకు మోడి సర్కార్ కోత!

హైదరాబాద్: నరేంద్రమోడి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేస్తూ సంక్షేమ పథకాలను నిర్లక్ష్యం చేస్తోందన్న వాదనకు బలంచేకూర్చే ఒక సమాచారం తాజాగా వెలుగులోకొచ్చింది. పేద వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్‌లకు బడ్జెట్‌లో కేటాయింపులను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరినుంచి రు.10,500 కోట్లనుంచి రు.7,187 కోట్లకు తగ్గించింది. ఇదే కాకుండా మరికొన్ని కీలక రంగాలకుకూడా కేంద్రం బడ్జెట్ కేటాయింపులలో కోత విధించింది. బాలల విద్యారంగానికి 2014-15లో రు.81,075 కోట్లు కేటాయించగా, 2015-16లో ఆ మొత్తాన్ని రు.57,919 కోట్లకు తగ్గించారు. ఇవికాక ఐసీడీఎస్(ఇంటిగ్రేటెడ్ ఛైల్డ్ డెవలప్‌మెంట్ స్కీమ్) పథకానికి రు.18,000 కోట్లనుంచి రు.8000 కోట్లకు, సర్వశిక్షా అభియాన్ పథకానికి రు.28,000 కోట్లనుంచి రు.22,000 కోట్లకు, మధ్యాహ్న భోజన పథకానికి రు.13,000 కోట్లనుంచి రు.9,000 కోట్లకు కోత విధించారు. ఇంటిగ్రేటెడ్ ఛైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్‌కు మాత్రం రు.2.23 కోట్లను పెంచారు.

మరోవైపు విద్యారంగానికి కేటాయింపులను గణనీయంగా – 2014-15తో పోలిస్తే సుమారు 17% – తగ్గించారు. పాఠశాల విద్యకు నిధులను రు.55,000 కోట్లనుంచి రు.42,210 కోట్లకు, ఉన్నతవిద్యకు రు.800 కోట్లను కోత విధించారు.రక్షణ రంగానికి కేటాయింపులను రు.13,000 కోట్లను, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకానికి రు.9,864 కోట్లనుంచి రు.4,500 కోట్లకు, నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ పథకానికి రు.11,000 కోట్లనుంచి రు.3,600 కోట్లకు కోత విధించారు. ఆర్థిక సంవత్సరం మధ్యలో జరిపిన ఈ మార్పులు ఈ ఏడాది జనవరినుంచి అమలులోకి వచ్చాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజా స‌జ్జా… క‌రెక్టు రూటులో!

'హ‌నుమాన్' లాంటి హిట్ త‌ర‌వాత ఏ హీరోకైనా కాస్త క‌న్‌ఫ్యూజన్ మొద‌లైపోతుంది. త‌ర‌వాత ఏం చేయాలి? ఎలాంటి క‌థ‌లు ఎంచుకోవాలి? అనే విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డిపోతుంటారు. ఆ గంద‌ర‌గోళంలో త‌ప్పులు...

మేనిఫెస్టో మోసాలు : సీపీఎస్ రద్దు ఏది బాసూ !

" అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు " .. ఈ డైలాగ్ పాదయాత్ర పొడుగుతూ వినిపించింది. ఉద్యోగుల్ని పిలిపించుకుని ర్యాలీలు చేసి... ప్లకార్డులు పట్టుకుని ఎంత డ్రామా...

ఈ విషయంలో కేసీఆర్‌ నెంబర్ వన్ !

రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్ ను మించిన వారు లేరు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తన పార్టీ అభ్యర్థులను బీజేపీ ,కాంగ్రెస్ పంచుకున్నప్పటికీ ఆయన అభ్యర్థులను ఖరారు.. చేసి నోటిఫికేషన్ వచ్చిన...

హతవిధీ… వైసీపీకి ఏమిటీ దుస్థితి..!?

జగన్ బస్సు యాత్ర పేలవంగా సాగుతోంది. వరుస సర్వేలు షాక్ ల మీద షాకులు ఇస్తున్నాయి. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి అధికారం దిశగా దూసుకుపోతోంది. ఏదైనా చేయాలి..? అధికారం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close